సాధారణంగా అభిమాన సెలబ్రిటీలను వేరొక సెలబ్రిటీ కలిసినప్పుడు వారి మధ్య జరిగే సంభాషణలు, సన్నివేశాలు ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకుంటాయి. తమ అభిమాన నటుడి వర్క్ ని వేరే ఫేమస్ సెలబ్రిటీ వచ్చి ప్రశంసించినప్పుడు కలిగే ఆనందం వేరు. ప్రస్తుతం బాలీవుడ్ ఫేమస్ సింగర్ నేహా కక్కర్ అలాంటి ఆనందాన్ని అనుభూతి చెందుతోంది. ఆమె ఆనందానికి కారణం.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అవును.. ఇటీవల జరిగిన ఎన్డీటీవి ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా వేడుకలో రామ్ చరణ్.. ‘ట్రూ లెజెండ్’ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో రామ్ చరణ్ అవార్డు అందుకొని, అదే స్టేజ్ పై ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాడు.
అదే వేడుకలో పాల్గొన్న ఎంతోమంది రామ్ చరణ్ ని కలిసి అభినందించడం, కొంతమంది చరణ్ తో ఫోటోలు దిగడం కూడా జరిగింది. ఈ క్రమంలో బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్ సైతం రామ్ చరణ్ ని కలవడానికి వచ్చింది. ఇక నేహా రావడాన్ని గమనించిన రామ్ చరణ్ నమస్కరిస్తూ.. ‘మీ వర్క్ ని నేను పెద్ద అభిమానిని’ అని ప్రశంసించాడు. దీంతో ఆనందం పట్టలేక నేహా కక్కర్ ఆశ్చర్యానికి గురై.. ‘ఓ మై గాడ్.. మీ నుండి ఆ మాట వినడం ఆనందంగా ఉంది. నేను కూడా మీకు చాలా పెద్ద అభిమానిని’ అని చెప్పింది నేహా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పాన్ ఇండియా స్టార్ తనను ప్రశంసించడం చూసి మురిసిపోతూ వీడియో షేర్ చేసింది నేహా.
ఇక ఈ వేడుకలో రామ్ చరణ్ అందరిపట్ల వినయాన్ని, గౌరవ మర్యాదలను కనబరిచిన తీరుకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ ఈ ఏడాది పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’తో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా హీరోగా నటించాడు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్.. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో ఓ సినిమా చేయనున్నాడు. కాగా.. రీసెంట్ రామ్ చరణ్ దంపతులు త్వరలో పేరెంట్స్ కాబోతున్నారని మెగాస్టార్ చిరు ప్రకటించిన విషయం విదితమే. మరి చరణ్ ప్రశంస విని ఉబ్బితబ్బిబ్బైన నేహా కక్కర్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.