సింగర్ మంగ్లీ.. జానపద సాంగ్స్ కు పెట్టింది పేరు. ఆమె గొంతు నుంచి జాలువారిన ప్రతీ పాట ప్రజల నోళ్లల్లో నానిందే అనడంలో ఎలాంటి సందేహం లేదు. మంగ్లీ పాడిన పల్లె పాటలకు వస్తున్న ఆదరణ చూసి టాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయింది. దాంతో మంగ్లీకి సినిమా పాటలు పాడే అవకాశాన్ని కల్పించింది చిత్ర సీమ. ఇక సింగర్ గా భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో పాటలు పాడుతూ.. మంచి సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ‘ధమాకా’ సినిమా పాటతో ఆ క్రేజ్ మరింతగా పెరిగింది. అయితే ఈక్రమంలోనే మంగ్లీ గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే? మంగ్లీ త్వరలోనే ఓ పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా నటించబోతుందని. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
సాధారణంగా ఛైల్డ్ ఆర్టిస్టులు హీరోలుగా, హీరోయిన్ లుగా పరిశ్రమలోకి అడుగుపెట్టడం మనకు తెలిసిన విషయమే. వీరితో పాటుగా కొంత మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా వెండితెరపైకి హీరోయిన్ లుగా, హీరోలుగా రంగప్రవేశం చేసిన సంఘటనలు పరిశ్రమలో కోకొల్లలు. ఇక కొంత మంది సింగర్స్ సైతం వెండితెరపై తళుక్కున మెరిసిన సందర్భలూ లేకపోలేదు. అయితే టాలీవుడ్ స్టార్ సింగర్ అయిన మంగ్లీ.. త్వరలోనే వెండితెరపై కనిపించబోతున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. సింగర్ మంగ్లీకి కన్నడ ఇండస్ట్రీ నుంచి పిలుపు వచ్చినట్లు పరిశ్రమలో జోరుగా చర్చ నడుస్తోంది.
ఈ క్రమంలోనే డైరెక్టర్ చక్రవర్తి చంద్రచూడ్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న కన్నడ చిత్రం ‘పాదరాయా’. ఈ చిత్రంలో మంగ్లీ హీరోయిన్ గా నటించబోతున్నట్లు సమాచారం. 2013-14 సంవత్సరంలో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో హీరోగా నాగ శేఖర్ నటించబోతున్నారు. అదీకాక త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాబోతుందని సమాచారం. అయితే ఇప్పటి వరకైతే సింగర్ మంగ్లీ ఈ విషయంపై స్పందించలేదు. మరి సింగర్ మంగ్లీ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది అన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.