సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి అందరి మనసు గెల్చుకున్న సింగర్ కల్పన. బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆమె నటనపై కాకుండా సంగీతంపైనే ఎక్కువ శ్రద్ద చూపించారు. తర్వాత సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారారు. ఈ స్టార్ సింగర్ జీవితంలో అనేక ఒడిడుకులు ఎదుర్కొన్నారట. ఓ ఇంటర్వ్యూలో తాను పడ్డ కష్టాల గురించి ఎంతో ఆవేదనగా తెలిపారు. వివరాల్లోకి వెళితే..
‘మా తండ్రి, స్టార్ సింగర్ బాల సుబ్రహ్మణ్యం ఒకే కాలేజీలో చదువుకున్నారు. మా నాన్న ఏర్పాటు చేసిన మ్యూజిక్ బ్యాండ్ లో బాల సుబ్రహ్మణ్యం పాటలు పాడేవారు. అప్పటి నుంచి బాల సుబ్రహ్మణ్యంతో నాకు మంచి అనుబంధం ఉంది. చిన్నతనంలో నటిగా ఎంట్రీ ఇచ్చినా.. తర్వాత సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ఆరంభించాను. కానీ.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేయడం చాలా కష్టం అనిపించింది.. ఎందుకంటే.. డబ్బింగ్ చెప్పేటప్పుడు నవ్వడం, ఏడవడం, గట్టిగా లాంటివి చేయాలి. అందుకే డబ్బింగ్ ప్రొఫెషన్ వదిలివేశానని కల్పన చెప్పడం మానేశాను’..
‘నేను ఎంత సక్సెస్ సాధించినప్పటికీ.. నా జీవితంలో కొన్ని విషాద సంఘటనలు ఉన్నాయి. పాతిక సంవత్సరాలు పాటలు పాడుతూ వస్తున్నా.. ఎన్నో వేధింపులతో వివాహబంధం 2010లో ముగిసిపోయింది. నాకు ఒక పాప ఉంది.. ఆ సమయంలో నాకు ఉద్యోగం లేదు.. ఉన్నది మొత్తం కోల్పోవడంతో మానసిక వేదనకు గురయ్యాను. ఆఖరికి చనిపోవాలనే కఠిన నిర్ణయం తీసుకున్నాను. కానీ, సింగర్ చిత్రమ్మ నాకు ఎంతో ధైర్యం చెప్పారు.
నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి పుట్టావా? అంటూ నాలో ఎంతో ధైర్యాన్ని నింపారు. మలయాళంలో ఓ షో నడుస్తుంది అందులో పాల్గొంటావా అని అడిగారు.. ఆ షోలో పాల్గొని టైటిల్ గెల్చుకున్నాను. నాకు డబ్బు వచ్చింది.. అది ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.’.. 2017లో ప్రసారమైన బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ లో కల్పన పాల్గొన్నారు. నాలుగు వారాలకే ఎలిమినేట్ అయ్యారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: ఆ విషయంలో భయపడ్డాను.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా : స్టార్ హీరో