మనిషికి ప్రమాదాలు ఏ రూపంలో వస్తాయో ఎవరికీ తెలియదు. రెప్పపాటున జరిగే ప్రమాదాల్లో తీవ్ర గాయాలు కావొచ్చు.. కొన్నిసార్లు మనిషి ప్రాణాలే పోవొచ్చు. ఇటీవల సినీ ఇండస్ట్రీలో పలువురు సెలబ్రెటీలు ప్రమాదాలకు గురైన వార్తలు వస్తున్నాయి.. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ సింగర్ జుబిన్ నౌటియల్ కి ప్రమాదం జరగడంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
బాలీవుడ్ లో సింగర్ గా ఇప్పుడిప్పుడే ఫామ్ లోకి వస్తున్నాడు జుబిన్ నౌటియల్. గురువారం జుబిన్ ఇంట్లో మెట్లు దిగుతున్న సమయంలో హఠాత్తుగా ప్రమాదానికి కావడంతో వెంటనే ముంబాయిలో ఓ ప్రైవేల్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో జుబిన్ నౌటియల్ కి తలకు, పక్క టెముకలకు తీవ్రంగా గాయాలైనట్లు.. ఆయన కుడిచేయికి ఆపరేషన్ కూడా చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు కొంతకాలం వరకు అతని కుడిచేయిని వాడకూడదని వైద్యులు సూచించినట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.
ఈ మద్యనే దుబాయ్ లో ప్రదర్శనలు ఇచ్చాడు జుబిన్ నౌటియల్. ఈ దురదృష్టకర సంఘటన గురించి తెలుసుకున్న జుబిన్ అభిమానులు సోషల్ మీడియా ‘గెట్ వెల్ సూన్ జుబిన్’ అంటూ మెసేజ్ లు పెడుతున్నారు. మరికొంత మంది ఈ సమయంలో మీరు మనోబలంతో ఉండాలని.. త్వరగా కోలుకొని మీ మధుర గానాన్ని అభిమానులకు అందించాలని కోరుకుంటూ మెసేజ్ లు పెడుతున్నారు. బాలీవుడ్ సెలబ్రెటీలు సైతం జుబిన్ నౌటియల్ త్వరగా కోలుకొని రావాలని ఆకాంక్షిస్తున్నారు.