ప్రస్తుతం ఒక పాన్ ఇండియా సింగర్ కూడా హీరోయిన్లకి ఏ మాత్రం తగ్గకుండా దూసుకెళ్తుంది. ఆమె చిన్ననాటి ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ చిన్నారే ఇప్పుడు తన పాటలతో ఇండియాను షేక్ చేస్తుంది. ఇంతకీ ఈ ఫొటోలో కనిపిస్తున్న పాప ఎవరు? ఇప్పుడు తెలుసుకుందాం.
టాలెంట్ కి అందం తోడైతే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉండడం గ్యారంటీ. సాధారణంగా హీరోయిన్ల విషయంలో మనం ఇలాంటివి చూస్తూ ఉంటాము. ఇందులో పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా.. ఇతర రంగాల్లో రాణిస్తూ వారి అందంతో ఫాలోయింగ్ ను సంపాదిస్తారు కొంత మంది. క్రికెట్ ప్లేయర్ స్మృతి మంధాన, మాజీ టెన్నిస్ ప్లేయర్ షరపోవా, ఇండియన్ టాప్ సింగర్ శ్రేయ ఘోషల్ ఎంత పాపులరో ప్రేత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరు అంతగా ఫేమస్ అవ్వడానికి వారి టాలెంట్ తో పాటు అందం కూడా ప్రధాన కారణం. ప్రస్తుతం ఒక పాన్ ఇండియా సింగర్ కూడా హీరోయిన్లకి ఏ మాత్రం తగ్గకుండా దూసుకెళ్తుంది. ఆమె చిన్ననాటి ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ చిన్నారే ఇప్పుడు తన పాటలతో ఇండియాను షేక్ చేస్తోంది. మొన్నటివరకు ఈ లిస్టులో శ్రేయా ఘోషల్ ఉంటే.. ఇప్పుడు ఆ స్థానాన్ని ఈ ఫోటోలో ఉన్న పాప భర్తీ చేసిందని చెప్పవచ్చు. ఇంతకీ ఈ ఫొటోలో కనిపిస్తున్న పాప ఎవరు? ఇప్పుడు తెలుసుకుందాం.
ఆమె గొంతు వింటే ఊపు రావాల్సిందే. ఆమె అందం చూస్తే ఫిదా అవ్వాల్సిందే. సినిమా ఇండస్ట్రీలో సింగర్లు ఎక్కువవుతున్న తరుణంలో ఆమెకి మాత్రం దేశంలో ప్రేత్యేకమైన స్థానం ఉంది. అభిమానులు ఆమె పాటను ఎంతలా ఎంజాయ్ చేస్తారో.. ఆమె అందానికి అంతే అట్రాక్ట్ అవుతారు. ఆమె ఎవరో కాదు పాన్ ఇండియన్ సింగర్ జోనీతా గాంధీ. ఢిల్లీలో జన్మించిన ఈ సింగర్.. ఆ తర్వాత కెనడాకు వలస వెళ్ళిపోయింది. చదువులో బాగా రాణిస్తూనే.. సంగీతంలో ప్రావిణ్యం పొందింది. ఆ తర్వాత భారత దేశానికి వచ్చి ఇక్కడ సింగర్ గా అదరగొడుతుంది. ఇప్పటికే వందల పాటలు పాడిన జోనిత.. హ్యారీస్ జయరాజ్ మ్యూజిక్ డైరెక్షన్లో ఎక్కువ పాటలు పాడింది.
గతేడాది అనిరుద్ మ్యూజిక్ అందించిన బీస్ట్ సినిమాలో “హలమతి హబిబో” పాటకు మిలియన్ల వ్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాటతో ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక సర్కార్ వారిపాట సినిమాలో “మ మ మహేశా సాంగ్” ప్రేక్షకులని ఓ రేంజ్ లో ఆకట్టుకోగా.. ఇటీవలే సంక్రాంతి రిలీజైన విజయ్ వారసుడు సినిమాలో జిమికీ పొన్ను సాంగ్ కి కూడా మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం దేశంలో పలు చోట్ల ప్రోగ్రాంలు చేస్తూ బిజీగా మారిపోయింది ఈ బ్యూటీ సింగర్. పాటతో పాటు ఈమె అందం చూడడానికి వేలాది అభిమానులు ప్రోగ్రాంలకు వస్తూ ఉంటారు. మరి ఇంతలా ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ సింగర్ చిన్నప్పటి ఫోటో మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.