చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీలకు వారికంటూ ఓ పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఈ క్రమంలో వారు అప్పుడప్పుడు వారి వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. దాంతో అభిమానులు కూడా వారి విషయాలపై ఆసక్తిని చూపిస్తారు. ఇక సెలబ్రిటీలు తమ ఇంట్లో జరిగే వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం సాధారణమే. ఈ నేపథ్యంలోనే ఓ స్టార్ సింగర్ తన కుమార్తె పుట్టిన రోజు వేడుకల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
సింగర్ గీతా మాధురి.. టాలీవుడ్ స్టార్ సింగర్స్ లో ఒకరు. ఇటీవల తన భర్త నందు రణ్ వీర్ సింగ్ లా న్యూడ్ గా ఫొటోలకు పోజులివ్వడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు ఈ జంట. గీతా-నందు జంటకు పరిశ్రమలో మంచి క్రేజ్ ఉంది. బిగ్ బాస్ కు వెళ్లడంతో వీరి క్రేజ్ మరింతగా పెరిగింది. గీతా మాధురి ఏవిషయాన్నెనా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం అలవాటు. ఇక ఇన్ స్టాగ్రామ్ లో తనకు సంబంధించిన పిక్స్ ను షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది.
ఈ జంటకు 2019 ఆగస్టులో పాప జన్మించింది. అప్పట్లో తన బేబీ బంప్ ఫొటోలతో గీతా మాధురి షేర్ చేసిన పిక్స్ ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి. ఆ పాపకు దాక్షయణి అనే పేరు పెట్టారు. వారు మెుదటి నుంచి తమకు ఆడపిల్ల కావాలనే అనుకున్న సంగతిని పలు మార్లు చెప్పారు. వారు అనుకున్నట్టు గానే వారికి పాప పుట్టింది. దీంతో వారి ఆనందం రెట్టింపు అయింది.
ఈ క్రమంలో దాక్షయణికి ఈ ఆగస్టు 9కి 3సంవత్సరాలు నిండాయి. ఈ సందర్బంగా పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. దాక్షయణికి గీతా మాధురి అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ రూపంలో ఆశిస్సులు అందించారు. ప్రస్తుతం ఈ పుట్టిన రోజుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి గీతా మాధురి కుతురి ఫొటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.