Chinmayi: సంగీత ప్రియులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు చిన్మయి శ్రీపాద. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళంలోనూ మంచి పేరు తెచ్చుకున్నారామె. ఇక, సౌత్ స్టార్ హీరోయిన్ సమంతతో చిన్మయికి ప్రత్యేక అనుబంధం ఉంది. సమంత తొలి చిత్రం ‘ ఏమాయ చేశావె’ నుంచి ఆమెకు గొంతు అరువిస్తున్నారు చిన్మయి. సమంత నటనకు ప్రాణం పోస్తూ వస్తున్నారు. చిన్మయి వాయిస్ లేకుండా సమంతను గుర్తించటం చాలా కష్టం. అంతేకాదు! చిన్మయి మాట్లాడుతున్నప్పుడు వింటే.. అరే సమంతలా మాట్లాడుతుందే అనుకుంటాం. సమంత, చిన్మయిలు సినిమాలకు సంబంధించే కాదు. వ్యక్తిగతంగానూ మంచి స్నేహితులు.
వీలు చిక్కినప్పుడల్లా కలూస్తూ ఉంటారు. హీరోయిన్ సమంతతో తనకున్న అనుబంధంపై తాజాగా, ఓ ఇంటర్వ్యూలో చిన్మ యి స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘ రాహూల్, సామ్‌లు మంచి స్నేహితులు. నేను తనకు పరిచయం కానప్పటినుంచి రాహూల్‌తో సామ్‌కు పరిచయం ఉంది. సామ్ వల్లే తెలుగులో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా నా కెరీర్ మొదలైంది. ఇప్పుడు తన క్యారెక్టర్‌కు తానే డబ్బింగ్ చెప్పుకుంటోంది. అది ఆనందించాల్సిన విషయమే. ఇక, నేను సమంతకు డబ్బింగ్ చెప్పే దశ ఎండింగ్‌కు వచ్చింది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అదే ఇంటర్వ్యూలో తనపై ఓ నెటిజన్ కామెంట్‌పై మాట్లాడుతూ..
తాను తెలుగు కొద్దిగానే నేర్చుకున్నానన్నారు. పెద్ద బాలశిక్ష లాంటివి చదువుకున్నానని, బూతు పదాలు అస్సలు తెలీదని స్పష్టం చేశారు. ఓ సారి ట్విటర్‌లో ఓ వ్యక్తి తనను ‘‘నీలాంటి ఎల్‌ఎమ్’’ అని కామెంట్ పెట్టాడన్నారు. తనకు దాని అర్థం తెలీక, ఎంటని అడిగానన్నారు. ఎల్‌ఎమ్ అంటే లేడీ మాఫియా అని అతడు చెప్పాడన్నారు. ఆ తర్వాత చాలా మంది కామెంట్స్‌లో దాని నిజమైన అర్థాన్ని రాసుకు రావటం ద్వారా అదో బూతు పదం అని తెలుసుకున్నానన్నారు. మరి, చిన్మయి, సమంత డబ్బింగ్ బంధానికి తెరపడనుందా? అన్న దానిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Chinmayi: LM అని కామెంట్ పెట్టిన నెటిజన్.. ఏంటని అడిగిన సింగర్ చిన్మయి!