సౌత్ టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన సిమ్రాన్ తన చెల్లెల్ని కూడా సినిమాల్లోకి పరిచయం చేశారు. ఆమె పేరు మోనాల్ నావల్. మోనాల్ 2000 సంవత్సరంలో హీరోయిన్‌గా ఓ కన్నడ సినిమా చేశారు.
సినిమా ఇండస్ట్రీలో విషాదాలకు కొదువ లేదు. ప్రేమ వ్యవహారాలు, ఆర్థిక ఇబ్బందులు, అవకాశాల కొరత ఇలా ఏదో ఒక కారణంతో ప్రాణాలు తీసుకున్న వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ సౌత్ హీరోయిన్ సిమ్రాన్ చెల్లెలు మోనాల్ నావల్ కూడా ఒకరు. ఈమె హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రెండేళ్లకే ప్రేమ వ్యవహారం కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. అర్థాంతరంగా అందరినీ వదిలిపెట్టి వెళ్లిపోయారు. 2000 సంవత్సరంలో ఆమె తన 18 ఏట ‘ఇంద్ర ధనుష్’ అనే కన్నడ సినిమాతో సినిమా రంగ ప్రవేశం చేశారు.
ఆ తర్వాత విజయ్ హీరోగా వచ్చిన ‘ బద్రి’ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. తమిళంలో బిజీ హీరోయిన్ అయిపోయారు. పార్వయ్ ఒండ్రే పోదుమే, లవ్‌లి, సుముదిరం సినిమాల్లో నటించారు. తెలుగులో ‘ఇష్టం’ అనే సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నర్తించారు. హీందీలో కూడా ‘మా తుఘే సలామ్’ అనే సినిమా చేశారు. అయితే, సినిమాల్లో ఎంతో భవిష్యత్తు ఉన్న మోనాల్ కొరియోగ్రాఫర్‌తో ప్రేమ విఫలం కావటం వల్ల చనిపోయారు. 2002 ఏప్రిల్ 14న చెన్నైలోని తన ఇంట్లోని గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, ఆమె చనిపోవటానికి సరైన కారణాలు ఇప్పటికీ తెలియలేదు. అదో మిస్టరీగానే మిగిలిపోయింది.
ఇక, మోనాల్ చనిపోయి నిన్నటితో 20 ఏళ్లు గడిచింది. ఏప్రిల్ 14న ఆమె జయంతి సందర్భంగా అక్క సిమ్రాన్ ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఆమె తన ట్విటర్ ఖాతాలో చెల్లెలితో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ.. ‘‘ మా అందమైన చెల్లెలు మోనాల్‌పై ప్రేమకు గుర్తుగా.. నిన్ను ఎప్పుడూ మర్చిపోలేము’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం సిమ్రాన్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, చెల్లెలి జయంతి సందర్భంగా సిమ్రాన్ పెట్టిన ఎమోషనల్ పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
In loving memory of my beautiful sister Monal. You’ll be never forgotten 😘 pic.twitter.com/4E78Ol6PZz
— Simran (@SimranbaggaOffc) April 14, 2023