సిల్క్ స్మిత.. దశాబ్ద కాలం పాటు.. ఇండస్ట్రీలో అగ్ర తారగా కొనసాగింది. హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఐటమ్ గర్ల్‌గా విపరీతమై క్రేజ్ సంపాదించుకుంది. ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలగిన సిల్క్ స్మిత.. ఉన్నట్లుండి ఆత్మహత్య చేసుకుని.. మృతి చెందింది. నేటికి కూడా ఆమె మరణం ఓ మిస్టరీనే. ఇక తాజాగా సిల్క్ స్మిత రాసిన ఆఖరి ఉత్తరం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
వడ్లపట్ల విజయలక్ష్మి.. అంటే ఎవరబ్బా అని ఆలోచిస్తారు. అదే సిల్క్ స్మిత అంంటే చాలు ముసలి వాళ్ల నుంచి చిన్నారుల వరకు వెంటనే గుర్తు పడతారు. 1970వ కాలం సౌత్ ఇండస్ట్రీలో సిల్క్ స్మిత కాలమే నడిచింది. ఆమె సాంగ్ లేని సినిమాలు ఆ కాలంలో రాలేదు అంటే అతిశయోక్తి కాదు. ఇక కళ్లతోనే ప్రేక్షకులను మత్తులో ముంచేది సిల్క్ స్మిత. కళ్లే స్మితకు అందం, బలం అని చెప్పవచ్చు. ఏలూరుకు చెందిన సిల్క్ స్మిత.. నాలగవ తరగతి వరకే చదివింది. 15వ ఏటనే వివాహం చేసుకుంది. అయితే అది సాఫీగా సాగలేదు. దాంతో ఇంట్లో నుంచి పారిపోయి మద్రాస్ చేరుకుంది. అక్కడ టచప్ ఆర్టిస్ట్‌గా పని చేసేది. ఈ క్రమంలో ఆమెని గమనించిన మలయాళ దర్శకుడు ఆంథోనీ ఈస్ట్‌మన్ డైరక్షన్‌లో ఇనయె తేడీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సౌత్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. మరి అంత వైభోగం అనుభవించిన సిల్క్ స్మిత.. ఆత్మహత్య చేసుకుని.. అత్యంత దీని స్థితిలో మృతి చెందింది. ఇక చనిపోవడానికి ముందు సిల్క్ స్మిత రాసిన లెటర్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
జీవితంలో తాను ఎదుర్కొన్న కష్టాలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు.. తనను మోసం చేసిన వారు.. ఇలా తన ఆవేదనను లేఖలో వ్యక్తం చేసింది సిల్క్ స్మిత. ఉత్తరంలో సిల్క్ మాటలు చదివిన వారు ఎవరైనా.. కన్నీరు పెట్టక మానరు. పాపం ఇతం ప్రేమరాహిత్యాన్ని చవి చూసిందా అనిపించకమానదు. లేఖలో తన ఆవేదనను ఇలా చెప్పుకొచ్చింది స్మిత. ‘‘ఏడో ఏట నుంచే పొట్ట కూటి కోసం ఎన్నో కష్టాలు పడ్డాను. నాది అంటూ ఏమి లేదు.. నా కోసం ఎవరు లేరు. నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు. బాబు తప్ప నాకు ఎవరు లేరు. తను ఒక్కడే నన్ను అర్థం చేసుకున్నాడు. రాము, రాధకృష్ణ నన్నుమోసం చేశారు. దేవుడే వారిని శిక్షిస్తాడు’’ అని తన మనసులోని ఆవేదనను లేఖలో వెల్లడించింది.
‘‘ఐదేళ్ల క్రితం ఒకడు నాకు జీవితం ఇస్తాను అని నా లైఫ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు నాకు దూరమయ్యాడు. ప్రతి ఒక్కడు నా రెక్కల కష్టం తిన్నవాడే. బాబు తప్ప అందరూ నా సొమ్ము తిన్నారు. రోజూ టార్చర్ అనుభవించాను. ఈ బాధ భరించలేకపోతున్నాను.. దేవుడనే వాడుంటే.. నన్ను మోసం చేసిన వారిని శిక్షిస్తాడు’’ అని రాసుకొచ్చింది. అయితే ఈ లేఖలో ఎక్కడా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు.. వెల్లడించలేదు. ఇక రాధాకృష్ణ అనే వ్యక్తి సిల్క్ స్మిత సెక్రటరీ. ఆమె మృతి తర్వాత పోలీసులు అతడిని విచారించారు. అయితే ఈ కేసులో పోలీసులు ఎవరిని దోషులుగా తేల్చలేదు. ఈ లేఖ ఆధారంగానే ఆమెది ఆత్మహత్య అని తేల్చేశారు. సిల్క్ స్మిత మృతి చెంది నేటికి 26 ఏళ్లైనా.. ఇంకా అనేక అనుమానాలు అలానే ఉన్నాయి.
ఇండస్ట్రీలో దశాబ్దానికి పైగా సాగిన కెరీర్లో సిల్క్ స్మిత వందల చిత్రాల్లో నటించింది. చిరంజీవి, రజినీకాంత్, మోహన్ లాల్, బాలకృష్ణ… ఇలా టాప్ స్టార్స్ అందరితో సినిమాలు చేసింది. సౌత్‌లో అగ్ర తారగా ఎదిగిన ఆమె అంత్యక్రియలు అత్యంత దారుణంగా జరిగాయి. ఒక అనాధ శవంలా అయిన వారు, పరిశ్రమ ప్రముఖులు ఎవరూ పక్కన లేకుండానే ఆమెను సాగనంపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిగాక సిబ్బంది అంత్యక్రియలు పూర్తి చేశారు.
అయితే హీరో అర్జున్ మాత్రం ఆ రోజు సిల్క్ స్మిత భౌతికకాయాన్ని చూసేందుకు వెళ్ళాడట. సిల్క్‌స్మిత, అర్జున్ ఇద్దరు మంచి స్నేహితులు. అప్పటికే ఒంటరితనంతో కుంగిపోయిన సిల్క్ స్మిత.. నేను చనిపోతే కనీసం నువ్వయినా చూడటానికి వస్తావా అని అర్జున్‌ని తరచు అడిగేదట. తప్పకుండా వస్తానని అర్జున్ మాట ఇచ్చాడు. ఆ ప్రకారమే.. సిల్క్‌ను కడసారి చూడటానికి తాను మాత్రమే వచ్చాడు. ఇన్నేళ్ల తర్వాత తాజాగా సిల్క్ స్మిత రాసిన ఆఖరి ఉత్తరం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.