సౌత్ ఇండియన్ సినీ తారలు అందరినీ ఒకే వేదిక మీదకి చేర్చే పండగ ఏదైనా ఉందంటే అది.. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఫంక్షన్ ( సైమా) మాత్రమే. ఇందుకే సైమా వేడుకల కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తుంటారు. సైమా స్టేజ్ పై అందాలు అలా మెరుస్తుంటే.., ప్రేక్షకులే కాదు, స్టార్స్ కూడా స్పెల్ బౌండ్ అయిపోతుంటారు. మరి.. అంతటి రీచ్ ఉన్న ఈ వేడుకకి ఇప్పుడు వేదిక మాత్రమే కాదు, డేట్ కూడా ఫిక్స్ అయ్యింది.
కరోనా కారణంగా గత సంవత్సరం ఈ వేడుక జరగలేదు. ఇప్పుడు కూడా సైమా అవార్డు ఫంక్షన్ ఉండదేమోనని అనుకుంటున్న తరుణంలో గుడ్‌న్యూస్ చెప్పింది సైమా. 2021 సైమా అవార్డుల వేడుక హైదరాబాద్ వేదికగా సెప్టెంబర్ 18,19న మొదలవబోతున్నాయని అధికారిక ప్రకటన విడుదలైంది.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన సినీ జనాలను ప్రోత్సహించడానికి 2012లో సైమా ఏర్పాటు అయ్యింది. ఇప్పటివరకు 8 సార్లు విదేశాల్లోనే ఈ కార్యక్రమం జరిగింది.ఇప్పుడు తొలిసారిగా హైదరాబాద్ వేదికగా సైమా అవార్డ్స్ వేడుక జరగనుండటం విశేషం. మరి.., ఈ వేడుకలో ఎవరెవరిని అవార్డులు వరిస్తాయో చూడాలి.