సినీ ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్లు ప్రేమలో పడటం.. కొంతకాలానికి బ్రేకప్ చెప్పుకోవడం అనేది ఈ మధ్యకాలంలో సర్వసాధారణం అయినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే.. కొత్తగా మొదలైన ప్రేమజంటల నుండి కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సెలెబ్రిటీల వరకు అందరూ బ్రేకప్ చెప్పుకోవడం.. ఆ విషయాన్నీ సోషల్ మీడియాలో షేర్ చేయడం మాముల్ అయిపోయింది. అంతెందుకు ఈరోజుల్లో విడాకులు సైతం సోషల్ మీడియా పోస్ట్ ద్వారానే ప్రకటించేస్తున్నారు.
ఇక తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో సెలబ్రిటీ కపుల్ తమ ప్రేమకు బ్రేకప్ చెప్పేశారని బీటౌన్ లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ – హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఇటీవల బ్రేకప్ చెప్పుకున్నారని.. అందుకే ఈ మధ్య ఇద్దరూ ఎక్కడా కలిసి కనిపించడం లేదని సినీవర్గాలు చెబుతున్నాయి. మొన్నటివరకూ ఇద్దరూ ఒకరినొకరు విడిచి ఉండలేరేమో అనే రేంజిలో చెట్టాపట్టాలేసుకొని విందులు, వినోదాలకు తిరిగారు.
అలాగే కియారా – సిద్ధార్థ్ కలిసి షేర్షా సినిమాలో కూడా అద్భుతమైన కెమిస్ట్రీని పండించారు. వీరి కెమిస్ట్రీ చూసి, ప్రేమలో ఉన్నారనే వార్తలు విన్న సినీ ప్రేక్షకులు.. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారని భావించారు. కానీ తాజాగా ఇద్దరూ విడిపోయారని తెలిసేసరికి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం కియారా – సిద్ధార్థ్ బ్రేకప్ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా.. కియారా అద్వానీ తెలుగులో భరత్ అనే నేను – వినయ విధేయ రామ సినిమాలు చేసింది. ఇప్పుడు రామ్ చరణ్ తో RC15 మూవీ చేస్తోంది. మరి కియారా – సిద్ధార్థ్ బ్రేకప్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.