డీజే టిల్లు.. చిన్న సినిమాగా వచ్చి సాలిడ్ హిట్ కొట్టింది. దాంతో టిల్లు 2 ప్రకటించారు. హీరోయిన్ విషయంలో అనేక వార్తలు వచ్చాయి. ముందుగా ఓ హీరోయిన్ పేరు ప్రకటించడం.. ఆమె వెళ్లిపోయింది అంటూ వార్తలు రావడం కామన్ అయ్యింది. ఈ చిత్రంలో అనుపమ నటిస్తుంది అన్నారు. కానీ ఆమెకు, సిద్ధుకు సెట్‌లో గొడవ అయ్యిందని.. ఆమె కూడా ఈ చిత్రం నుంచి తప్పుకుందని వార్తలు వచ్చాయి. ఇక తాజాగా వీటిపై క్లారిటీ ఇచ్చాడు సిద్ధూ. ఆ వివరాలు..
సిద్ధూ జొన్నలగడ్డ.. హీరోగా కన్నా.. కూడా వివాదాలతోనే బాగా పాపులర్ అయ్యాడు. గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత డీజే టిల్లు సినిమాతో.. తెలుగులో సాలిడ్ హిట్ కొట్టాడు. రొమాంటిక్ క్రైమ్ కామెడీ సినిమాగా తెరకెక్కిన డీజే టిల్లు సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ తన పూర్తి టాలెంట్‌ని తెరపై చూపించేశాడు. ఈ డీజే సౌండ్ ఇంకా మారుమోగుతూనే ఉంది. ఈ సినిమా సాధించిన భారీ విజయం నేపథ్యంలో డీజే టిల్లు 2ని ప్రకటించాడు. ఫస్ట్ పార్ట్‌లో నేహా శెట్టి.. రాధిక పాత్రలో నటించి.. ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. అయితే పార్ట్ 2లో నేహా శెట్టిని హీరోయిన్‌గా తీసుకోలేదు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేస్తోంది అన్నారు.
కానీ ఆఖరి నిమిషంలో ఈ చిత్రం నుంచి అనుపమ తప్పుకుందని.. వార్తలు వచ్చాయి. సిద్ధూకి, అనుపమకి సెట్‌లో గొడవ అయ్యిందని.. దాంతో ఆమె సెట్ నుంచి వెళ్లిపోయిందని వార్తలు వచ్చాయి. ఇక అనుపమ ప్లేస్‌లో చివరకు మడోన్నా సెబాస్టియన్ డీజే టిల్లు 2 హీరోయిన్‌గా ఫైనల్ అయ్యిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఫైనల్‌గా మడోన్నా స్థానంలో మీనాక్షి చౌదరీ.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అంతేకాక డీజే టిల్లు కు విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా.. దాని సిక్వెల్‌కు రామ్ మల్లిక్ డైరెక్టర్. విమల్ కృష్ణతో కూడా సిద్ధూ గొడవపడ్డాడని.. అందుకే అతడు సీక్వెల్‌కి దర్శకత్వం వహించడం లేదనే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వివాదాలపై సిద్ధూ జొన్నలగడ్డ క్లారిటీ ఇచ్చాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వివాదాలపై స్పందిస్తూ.. క్లారిటీ ఇచ్చాడు సిద్ధూ. ‘‘నేను డీజే టిల్లు 2 సినిమా గురించి ప్రకటించిన నాటి నుంచి మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఇక టిల్లు స్క్వేర్ సినిమా అనుకున్నప్పుడు.. మేం ముందుగా అప్రోచ్ అయ్యింది అనుపమను. ఇక సినిమా గురించి మేం ఎప్పుడు మీటింగ్ పెట్టినా అది ఒక వార్త అవుతుంది. వాళ్లు వెళ్లిపోయారంట.. ఆ అమ్మాయి వెళ్లిపోయింది అంటా అంటూ ఏవో వార్తలు వచ్చాయి. ఇక అనుపమ అయితే సెట్‌లో నాతో గొడవ పడిందని రాసేశారు. ఇవన్ని చూసి నేనే ఒక ట్వీట్ పెడదామనుకున్నాను అంటూ అనుపమతో వివాదంపై క్లారిటీ ఇచ్చాడు సిద్ధూ. అలానే డైరెక్టర్ విమల్ కృష్ణతో గొడవపై క్లారిటీ ఇస్తూ.. లైవ్‌లోనే అతడికి కాల్ చేశాడు. ప్రసుత్తం ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రొమో నెట్టింట వైరల్ అవుతుంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.