యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..బాహుబలి సినిమాతో నటుడిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఈ మూవీ రెండు భాగాలుగా విడుదలై ఎన్నో రికార్డులను తిరగరాసింది. దగ్గుబాటి రానా, ప్రభాస్ కలిసి నటించిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించిన విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ చిత్రంతో ప్రభాస్ రేంజ్ టాలీవుడ్ లో అగ్రభాగానికి ఎగబాకింది.
బాహుబలి సినిమా విజయాన్ని ఆనందిస్తూనే యువ దర్శకుడు సుజిత్ డైరెక్షన్ లో సాహో అనే మూవీ చేశాడు. ఈ చిత్రం మాత్రం ప్రభాస్ కి అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తరువాత పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల ప్రభాస్ ఎక్కువగా బాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ కి ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ అనే అద్భుతమైన ప్రేమ కథలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయనకు జోడిగా అందాల సుందరి పూజా హెగ్డే నటిస్తోంది. ఇది కాకుండా సలార్, ఆదిపురుష్ వంటి విభిన్న సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
ఇక కొత్తగా ప్రభాస్ గురుంచి ఫిల్మ్ నగర్ లో కొన్ని ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆనంద్ సిద్దార్థ్ అనే బాలీవుడ్ డైరెక్టర్ తో ఓ సినిమాను చేయనున్నాడని తెలుస్తోంది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందని సమాచారం. ఇక లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డ సినిమా షూటింగ్ లు కాస్త ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. దీనికి తోడు.., మరికొన్ని రోజుల్లో సినిమా థియేటర్లు కూడా తెరుచుకుంటాయని సమాచారం. దీంతో.., ప్రభాస్ తన కొత్త సినిమాల విషయంలో ఇలా స్పీడ్ పెంచినట్టు తెలుస్తోంది. ఆనంద్ సిద్దార్థ్ గతంలో బాలీవుడ్ లో వార్, బ్యాంగ్ బ్యాంగ్ వంటి భారీ ప్రాజెక్ట్స్ ని తెరకెక్కించిన విషయం తెలిసిందే.