ఒక హీరోగా, యంగ్ రెబల్ స్టార్ గా, ప్యాన్ వరల్డ్ స్టార్ గా ప్రభాస్ తనేంటో నిరూపించుకున్నాడు. ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. తన నటన, బాక్సీఫీసు దగ్గర ప్రభాస్ స్టామినా అందరికీ తెలుసు. కానీ, తెలియని ఒక విషయం ఏంటంటే.. ప్రభాస్ ఇంట్లో వాళ్లతో ఎలా ఉంటాడు? కృష్ణంరాజుతో ఆయన బాండింగ్ ఎలా ఉంటుంది? ఈ విషయాలు పెద్దగా బయట తెలియవు. ఆ విషయాలను సుమన్ టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి స్వయంగా చెప్పారు.
ఇదీ చదవండి: రెబల్ స్టార్ కృష్ణంరాజుకు ఆపరేషన్..
‘ప్రభాస్ కుటుంబం విషయంలో ఎంతో ప్రేమగా ఉంటారు. మాకు సొంత కొడుకులా ప్రతి విషయంలో దగ్గరుండి ధైర్యం చెప్తుంటారు. అంత పెద్ద స్టార్ అయినా కూడా ఇంట్లో వాళ్ల అమ్మ అన్నా, నేనన్నా ఎంతో ప్రేమగా ఉంటారు. ఆయన కిందపడి సర్జరీ జరిగిన సమయంలో కూడా ఎంతో ధైర్యం చెప్పారు. అదంతా చిన్నదే.. సర్జరీ కూడా ఇట్టే జరిగిపోతుంది. భయపడాల్సింది ఏం లేదని దగ్గరుండి సొంత కొడుకులా వాళ్ల పెదనాన్నను చూసుకున్నారు. మేమెంతో పుణ్యం చేసుకోబట్టే ప్రభాస్ లాంటి కొడుకు దొరకాడు.’
‘ప్రభాస్ చూపించే ప్రేమానురాగాలు మాటల్లో చెప్పలేం. ప్రమోషన్స్ కు జపాన్ వెళ్దామా? బ్యాంకాక్ వెళ్దామా? అని వాళ్ల పెదనాన్నను అడుగుతున్నారు. కృష్ణంరాజు గారు కూడా రెండ్రోజుల్లో మీడియా ముందుకు వచ్చేస్తారు’ అంటూ శ్యామలా దేవి రెబల్ స్టార్- యంగ్ రెబల్ స్టార్ మధ్య ఉండే అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. కృష్ణంరాజు- ప్రభాస్ బాండింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.