నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ డ్రామా మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి.. చాలా కాలంగా సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నానికి ‘శ్యామ్ సింగ రాయ్’ హిట్ ఇచ్చిందా? లేదా? ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
కథ:
సినిమా తీసి డైరెక్టర్ అయిపోవాలి అని కలలు కనే కుర్రాడు వాసు. ఇందుకోసం తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి షార్ట్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తుంటారు. ఈ క్రమంలో తనకి పరిచయమైన కృతి శెట్టిని తన షార్ట్ ఫిలింలో నటింపజేసే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ.., అనుకోకుండా ఆ షార్ట్ ఫిల్మ్ ఓ వివాదానికి కారణం అవుతుంది. అందులో నుండి బయట పడటానికి వాసు శ్యామ్ సింగ రాయ్ గతం గురించి తెలుసుకోవాల్సి వస్తుంది. అసలు ఎవరీ శ్యామ్ సింగ రాయ్. మైథిలీ ప్రేమ అతనిలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? ఆ మైథిలీ నేపధ్యం ఏమిటి? అసలు వాసుకి, శ్యామ్ సింగ రాయ్ కి ఉన్న సంబంధం ఏమిటి అన్నదే ఈ చిత్ర కథ.
విశ్లేషణ:
ఒక బలమైన కథని చెప్పాలంటే.. గొప్ప నటులు కావాలి. శ్యామ్ సింగ రాయ్ సినిమాకి నాని, సాయిపల్లవి రూపంలో అలాంటి నటులే దొరికారు. కాస్త స్లో గా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ ని పక్కన పెడితే సెకండ్ ఆఫ్ లో వీరిద్దరూ పోటీ పడి నటించారు. ఇక సెకండ్ హాఫ్ లో నాని శ్యామ్ పాత్రలో సోషల్ యాక్టివిస్ట్ గా కనిపిస్తాడు. బడుగు బలహీన వర్గాల కోసం శ్యామ్ సింగ రాయ్ పోరాటం చేస్తుంటాడు. ఇదే మైథిలీ దేవదాసీగా కనిపిస్తుంది సాయిపల్లవి. సిరివెన్నెల రచించిన ‘ప్రణవలయ’ సాంగ్ లో సాయి పల్లవి విశ్వరూపమే చూపించింది. ఊహించని మలుపులతో క్లైమాక్స్ అద్భుతమా ఉంటుంది. శ్యామ్, మైత్రేయి మధ్య ఏం జరిగింది.. వాసు తన సినిమా వివాదం నుంచి ఎలా బయట పడ్డాడు అనేది మిగిలిన కథ. దర్శకుడు రాహుల్ ఈ చిత్రంలో ప్రతి ప్రేముకి క్లాసిక్ టచ్ ఇచ్చాడు. ఇక టెక్నీకల్ గా, నటీనటుల పెర్ఫార్మెన్స్ పరంగా శ్యామ్ సింగ రాయ్ అద్భుతమనే చెప్పుకోవాలి.
ఇది కూడా చదవండి: “83” మూవీ రివ్యూ
ప్లస్ పాయింట్స్ :
మైనస్ పాయింట్స్:
చివరి మాట:
“శ్యామ్ సింగ రాయ్” నానిని సక్సెస్ ట్రాక్ ఎక్కించిన సినిమా