Shyam Prasad Reddy: సుధీర్, శ్రీను, రామ్ ప్రసాద్.. ‘జబర్థస్త్ షో’ అంటే ఒకప్పుడు ఈ ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపించేవి. కేవలం వారి స్కిట్లు చూడటం కోసం మాత్రమే మొత్తం షో చూసే వాళ్లు కొందరు. రీల్ మీద, రియల్ గానూ వారి స్నేహానికి ముచ్చట పడిపోయేవారు. కానీ, తర్వాతి కాలంలో వేరు వేరు కారణాల వల్ల సుధీర్, శ్రీను ‘జబర్థస్త్ ’షోను వీడారు. ప్రస్తుతం రామ్ ప్రసాద్ మాత్రమే షోలో ఉన్నాడు. తన మిత్రులు లేని లోటును గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. అయితే, ఆ ఇద్దరూ షోను వీడటానికి జబర్థస్త్ యాజమాన్యంతో ఉన్న గొడవలే కారణమన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అంతేకాదు! కిరాక్ ఆర్‌పీ ఆ ఇద్దరూ షోను ఎందుకు వీడారో చెబుతూ జబర్థస్త్ యాజమాన్యంపై పలు ఆరోపణలు కూడా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘జబర్థస్త్’ షో నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి.. సుధీర్, శ్రీను, రామ్ ప్రసాద్‌లపై చేసిన కామెంట్లకు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో శ్యాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ సుధీర్, శ్రీను, రామ్ ప్రసాద్.. వీళ్లు ముగ్గురు కాదు.. వీళ్లు ముగ్గురూ కలిసి ఓ మనిషి. ఈ ముగ్గురు కలిసి ఒకటయినపుడు..
వాళ్లు నెక్ట్స్ లెవెల్‌కు వెళతారు. ఆ ముగ్గురు నా బోర్‌డమ్‌కు మెడిసిన్ లాంటి వాళ్లు. నా ఐప్యాడ్‌లో ముగ్గురికి సంబంధించిన 100కు పైగా స్కిట్లు ఉంటాయి. బోర్ కొట్టినపుడు వాళ్ల వీడియోలే చూస్తాను. మళ్లీ ఎనర్జీ వస్తుంది. ట్రాఫిక్‌లో ఉన్నపుడు కూడా వాళ్ల వీడియోలు చూస్తాను. వాళ్లు నాకు అత్యంత సన్నిహితులు’’ అని అన్నారు. మరి, కిర్రాక్ ఆర్పీ ఆరోపణల నేపథ్యంలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Rashmika Mandanna: వీడియోలు: హాట్ లుక్‌లో హీట్ పెంచుతున్న నేషనల్ క్రష్ రష్మిక!