సినిమాల్లో నటించిన హీరోయిన్లు ఒకప్పుడు ఉన్నట్టు ప్రస్తుతం ఉండరు. ఫేడవుట్ అయిపోయిన హీరోయిన్స్‌ని ఒక్కసారిగా చూస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోతారు. ఒకప్పుడు నాజూకుగా ఉండే హీరోయిన్లు ఇప్పుడు లావుగా అయిపోతారు. కానీ శ్వేతా బసు ప్రసాద్ మాత్రం అందుకు భిన్నంగా దర్శనమిచ్చారు. ఇలియానాలా స్లిమ్‌గా కనబడుతూ అందరికీ షాకిచ్చారు. ఆమె ఈ కొత్త లుక్‌ని చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్వేతా బసు ప్రసాద్.. మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ‘ఎక్కాడా’ అనే డైలాగ్‌తో బాగా ఫేమస్ అయ్యారు. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలేవీ పెద్దగా కలిసి రాలేదు. దీంతో ఆమె టాలీవుడ్‌కి టాటా చెప్పేసి.. బాలీవుడ్‌కి వెళ్ళిపోయారు.
అక్కడ షార్ట్ ఫిల్మ్‌లు, ఫీచర్ ఫిల్మ్‌లు, వెబ్ సిరీస్‌లు చేసుకుంటూ నెట్టుకొచ్చిన ఈమె మధ్యలో వ్యక్తిగతంగా కొన్ని డిస్టర్బెన్స్‌లు వచ్చాయి. అయితే పూర్తిగా సినిమాలకి దూరమైన శ్వేతా.. ‘క్రిమినల్ జస్టిస్ అధుర సచ్’ అనే హిందీ వెబ్ సిరీస్‌లో నటించారు. ఇదిలా ఉంటే రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్వేతా బసు ప్రసాద్.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో శ్వేతా.. సితార వాయిస్తూ దర్శనమిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆమె జనగణమన జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈమె టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా అయిపోయారు.
అయితే చేతిలో ఉన్న సితారలా ఆమె కూడా నాజూకుగా కనిపించేసరికి కొంతమంది నెటిజన్లకి మెంటలొచ్చేసింది. ‘శ్వేతా బసు ప్రసాదేనా.. ఇంత స్లిమ్‌గా ఉంది’ అని ఒక్క క్షణం గుర్తుపట్టలేకపోయారు. ఆమె సోదరి అయి ఉంటుందిలే అని సందేహం వ్యక్తం అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. కెరీర్ తొలినాళ్ళలో బొద్దుగా కనిపించిన శ్వేతా.. ఇప్పుడు ఇలా స్లిమ్‌గా కనిపించేసరికి గుర్తుపట్టలేకపోతున్నారు. మరి ఇంత నాజూకుగా తయారైన ఈ బ్యూటీని కొత్త అవకాశాలు వరిస్తాయో లేదో చూడాలి.