సాధారణంగా స్టార్ హీరోయిన్స్ మేకప్ లేకుండా సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టేందుకు వెనకాడుతుంటారు. ఈ విషయంలో శృతిహాసన్ రూటే సపరేటు అంటోంది. అందరు హీరోయిన్స్ అందంగా ముస్తాబైన ఫోటోలు పెడుతుంటే.. శృతి మాత్రం డిఫరెంట్ గా, ఎవ్వరికీ అర్థం కాని ఫోజులలో ఫోటోలు పోస్ట్ చేస్తుంది. కొన్నిసార్లు శృతిహాసన్ కి ఏమైందో అనిపించేలా చేస్తుంటుంది. శృతి పోస్టు చేసిన కొత్త ఫోటోలు చూసిన ఫ్యాన్స్ అంతా ప్రస్తుతం అదే ఆలోచిస్తున్నారు. హీరోయిన్స్ డిగ్లామర్ లుక్ లో, మేకప్ లేకుండా కనిపిస్తే.. వారిపై నెగటివ్ ప్రభావం పడుతుందేమోనని ఆగిపోతుంటారు. అలాంటి భయాలేవీ తనకు లేవంటోంది శృతి.
ఇంతకీ శృతి ఎలాంటి ఫోటోలు పెట్టిందంటే.. ఆమెను చూసిన ఫ్యాన్స్ కూడా వరస్ట్ గా ఉన్నాయని.. నీ ముఖానికి అసలు ఏమైంది శృతి? అంటున్నారు. ఆ ఫోటోలు పెట్టిన శృతి.. తాను ఫీవర్, సైనస్ తో బాధపడుతున్నానని, రుతుస్రావంలో ఉన్నానని చెప్పింది. అలాగే బ్యాడ్ డే, బ్యాడ్ హెయిర్ తో ప్రెజెంట్ తన సెల్ఫీలు ఇలా ఉన్నాయని.. అయినాసరే తనను ఈ లుక్ లో అంగీకరిస్తారని, పిక్స్ ఇష్టపడతారని అనుకుంటున్నా..” అని క్యాప్షన్ జోడించింది. ఆ ఫోటోలు చూసి ఫ్యాన్స్ పాజిటివ్, నెగటివ్ రెండు విధాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం శృతికి సంబంధించి ఈ మేకప్ లేని కొత్త సెల్ఫీలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా.. కెరీర్ పరంగా శృతి చేతినిండా సినిమాలతో బిజీ అయిపోయింది. క్రాక్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ భామ.. ప్రస్తుతం ప్రభాస్ సరసన పాన్ ఇండియా మూవీ ‘సలార్’లో నటిస్తూనే.. మరోవైపు నటసింహం బాలయ్య సరసన ‘వీరసింహారెడ్డి’లో నటిస్తోంది. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. శృతి రెండేళ్లుగా డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో డేటింగ్ చేస్తోంది. ప్రస్తుతం అతనితో కలిసి ముంబైలో ఉంటోంది శృతి. గతంలో ఓ ఫారెన్ మ్యూజిషియన్ తో ప్రేమాయణం నడిపిన శృతి.. ఇప్పుడు శాంతనుతో ప్రేమలో పడిందని సమాచారం. చూడాలి మరి ఇతనితో అయినా పెళ్లి పీటలు ఎక్కుతుందేమో!