సినీ ఇండస్ట్రీలో కోవిడ్ కేసుల సంఖ్య ఇంకా సద్దుమణిగినట్లు లేదు. బాలీవుడ్ మొదలుకొని టాలీవుడ్ వరకు అందరూ స్టార్స్, ఆర్టిస్టులు కోవిడ్ సోకి హోమ్ క్వారంటైన్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇండస్ట్రీలో మరో స్టార్ హీరోయిన్ కోవిడ్ బారిన పడింది. ఈ విషయాన్ని కూడా స్వయంగా ఆమెనే సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది. క్రాక్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కోవిడ్ బారినపడింది.
ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్ గా వచ్చిందని అభిమానులకు తెలిపింది. ఆమె పోస్టులో.. “అందరికీ నమస్కారం! ఇది సరదా విషయం కాదు. కోవిడ్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. కోలుకొని త్వరలో తిరిగి వస్తాను. ధన్యవాదాలు, త్వరలో కలుద్దాం లవ్లీస్” అని తెలిపింది.
ఇక కెరీర్ పరంగా శృతిహాసన్ ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ‘బెస్ట్ సెల్లర్’ సిరీస్ లో కనిపించింది. ఇక సినిమాల విషయానికొస్తే, శృతి ప్రస్తుతం.. ప్రభాస్ సరసన సలార్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో శృతి పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేస్తోంది. మరి శృతిహాసన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.