సోషల్ మీడియాలో సెలబ్రిటీలు బాగా యాక్టివ్ గా ఉంటారు. అభిమానులతో టచ్ లో ఉంటూ ఏదో ఒక అప్డేట్ ఇస్తుంటారు. ఇక హీరోయిన్స్ అయితే గ్లామరస్ పిక్స్ అప్లోడ్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంటారు. కొంతమంది హీరోయిన్లు డైరెక్ట్ గా అభిమానులతో లైవ్ చాటింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో నెటిజన్లు వింత వింత ప్రశ్నలు అడుగుతుంటారు. వాటికి సెలబ్రిటీలు ఓపిగ్గా సమాధానం చెబుతుంటారు. తాజాగా శృతిహాసన్ కూడా సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ తో లైవ్ చాటింగ్ లో పాల్గొంది. ఏదైనా అడగండి అంటూ అవకాశం ఇచ్చింది. ఇంకేముంది ఓ నెటిజన్ శృతిహాసన్ ని డైరెక్ట్ గా నువ్వు కన్యవేనా? అంటూ అడిగేశాడు.
కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చిన శృతిహాసన్.. తన నటనతో, గ్లామర్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సింగర్ గా కూడా తన సత్తా చాటింది. అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్.. ఓ మై ఫ్రెండ్, 3, సెవెంత్ సెన్స్ వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. రవితేజ, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించింది. ఇటీవలే చిరంజీవి, బాలకృష్ణ సరసన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాల్లో నటించి బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ సినిమాలో నటిస్తోంది.
వ్యక్తిగత జీవితానికొస్తే శృతిహాసన్ తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాతో డేటింగ్ చేస్తోంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే శృతిహాసన్.. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. అప్పుడప్పుడు నెటిజన్స్ తో లైవ్ చాట్ చేస్తుంటుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా బాయ్ ఫ్రెండ్ తో కలిసి లైవ్ చాటింగ్ లో పాల్గొంది శృతిహాసన్. ఈ లైవ్ చాటింగ్ లో నెటిజన్స్ శృతిహాసన్ ను పలు ప్రశ్నలు అడిగారు. ‘నేను మీతో సహజీవనం చేయాలనుకుంటున్నాను’ అని అడగ్గా.. శృతిహాసన్ అతనికి నో చెప్పింది.
ఇక మరో నెటిజన్.. నువ్వు వర్జిన్ వేనా అంటూ ఆమెను ప్రశ్నించాడు. దీంతో తిక్కరేగిన శృతిహాసన్ అతడికి అదే స్థాయిలో సమాధానం చెప్పింది. అతను వర్జిన్ స్పెల్లింగ్ తప్పు రాశాడు. ‘ముందు నువ్వు వర్జిన్ స్పెల్లింగ్ సరిగా రాయడం నేర్చుకో’ అంటూ ఘాటుగా జవాబిచ్చింది. అయితే శృతిహాసన్ మాత్రం అతను అడిగిన ప్రశ్నకు జవాబు అయితే చెప్పలేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి నెటిజన్ అడిగిన ప్రశ్నకు శృతిహాసన్ బదులిచ్చిన తీరుపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.