శృతిహాసన్ తన అందం, అభినయంతో కుర్రకారు మదిలో ఓ ప్రత్యేక స్థానం సంపాందించిన హీరోయిన్. విశ్వనటుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి శృతిహాసన్ అడుగుపెట్టింది. “అనగనగా ఓ ధీరుడు” సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. తన తొలి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాందించుకుంది. అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోలందరితో నటించి.. హీరోయిన్ గా సత్తా చాటింది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో వ్యక్తిగత జీవితంలో ఎదురైన కొన్ని సమస్యల కారణంగా కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. నాగ చైతన్యతో కలిసి నటించి ‘ప్రేమమ్’ సినిమా గురించి తన అనుభవాలను షేర్ చేసుకుంది.
2016లొ నాగ చైతన్యతో కలిసి నటించి ‘ప్రేమమ్’ సినిమా గురించి మాట్లాడుతూ.. “ఆ సినిమాలో నేను చేసిన మలర్ పాత్రపై ఎక్కువ ట్రోల్స్ వచ్చాయి. మలర్ పాత్రను మలయాళ ఒరిజనల్ వెర్షన్ సాయిపల్లవి నటించింది. మలయాళ మలర్ పాత్రతో పోల్చి నన్ను బాగా ట్రోల్ చేశారు. ఆ సమయంలో నేను చాలా బాధపడ్డాను. అసలు ఆ సినిమాలో నటించకుండా ఉండి ఉంటే బాగుండేది అని ఫీలయ్యాను. అయితే ఆ బాధ కొద్దిసేపే.. ట్రోల్స్ ను పక్కన పెడితే.. ఆ సినిమాలో మలర్ పాత్రల్లో ప్రతిక్షణం ఎంజాయ్ చేశాను” అని ఈ బ్యూటీ తెలిపింది. ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల రవితేజ తో నటించిన క్రాక్ ఘన విజయాన్ని అందుకుంది. దీంతో బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. మరి.. ప్రేమమ్ సినిమాపై శృతిహాసన్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.