సిరి హనుమంత్.. యాంకర్‌గా పరిచయం అయ్యి.. వెబ్ సిరీస్‌లు చేస్తూ.. ఆ తర్వాత సీరియల్స్, సినిమాలు చేస్తూ.. గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమెకు బిగ్‌బాస్‌కు వెళ్లే అవకాశం వచ్చింది. ఈ రియాలిటీ షోలో పాల్గొన్నవారికి దాని వల్ల ఎంత మేలు జరిగిందో తెలియదు.. కానీ సిరి మాత్రం విపీరతమైన నెగిటివిటీని మూట కట్టుకుంది. బిగ్ బాస్‌కు వెళ్లే ముందు వరకు ఉన్న మంచిపేరును ఈ షోతో పూర్తిగా పొగొట్టుకుంది. బిగ్ బాస్‌లోకి వెళ్లడానికి ముందే సిరి-శ్రీహాన్ రిలేషన్‌లో ఉన్నారు. కానీ హౌజ్‌లోకి వెళ్లిన తర్వాత సిరి, షణ్మఖ్‌కి దగ్గరవ్వడం, హగ్గులు, కిస్సులతో రెచ్చిపోవడంతో ఇద్దరి మీద విపరీతైమన ట్రోలింగ్ నడిచింది. వీరి కుటుంబ సభ్యులు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. సిరి-షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్‌లో రిలేషన్ కారణంగా షణ్ముఖ్ ప్రేయసి దీప్తి సునయన బ్రేకప్ చెప్తే.. బయట ఉండి ఎన్నో అవమానాలు, ట్రోలింగ్ బారిన పడ్డ శ్రీహాన్ మాత్రం ప్రేయసికి అండగా నిలిచాడు.
ఇది కూడా చదవండి: బిగ్ బాస్ లో అన్ని గొడవలు పడినా.. ప్రియ అడగగానే వీజే సన్నీ సాయం చేశాడు!
అంతేకాక బిగ్ బాస్ వేదిక మీద తన మెచ్యూర్డ్ పర్సనాలిటీతో ఎంతో మంది ఆడియన్స్‌కి చేరువ అయ్యాడు. బిగ్ బాస్ స్టేజ్‌పై ‘నన్ను వదిలేస్తున్నావా?’ అని సిరిని అడిగి ఆమె కళ్లు తెరిపించడంతో పాటుగా.. అందరి కళ్లు చెమ్మగిల్లేట్టు చేశాడు శ్రీహాన్. ఈ క్రమంలో ఫ్యామిలీ ఎపిసోడ్‌కి గెస్ట్‌గా వెళ్లిన శ్రీహాన్.. పరిస్థితికి తగ్గట్టుగా స్టేజ్‌పై పాట పాడి వీడ్రా నిజమైన ప్రేమికుడు అంటే తానే అనేట్టుగా అందరితో శెభాష్ అనిపించుకున్నాడు. ఇక బిగ్ బాస్ తరువాత.. సిరి-శ్రీహాన్‌లు విడిపోతున్నారంటూ వార్తలు రాగా వాటన్నింటినీ కొట్టిపారేస్తూ మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు శ్రీహాన్, సిరిలు. మునుపటిలాగే కలిసి వెబ్ సిరీస్‌లు చేస్తూ తమ పని తాము చేసుకునిపోతున్నారు.
ఇది కూడా చదవండి: బిగ్ బాస్ తర్వాత.. మొదటిసారి ఒకే పార్టీలో కనిపించిన సిరి- శ్రీహాన్!
ఈ నేపథ్యంలో వీళ్ల బంధం బీటలు వారిందనే వాళ్ల నోటికి తాళం వేస్తూ తన ప్రేయసి సిరి గురించి అద్భుతంగా మాట్లాడాడు శ్రీహాన్. యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానల్‌లో నవ్వులే నవ్వులు అంటూ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్‌తో ఫన్నీ ఇంటర్వ్యూ చేశాడు. దానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా.. ఇందులో శ్రీహాన్.. సిరి ఈ రోజు ఈ స్థాయికి రావడానికి తన జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో చెప్పుకొచ్చాడు. సిరి కోసం శ్రీహాన్ వీడియో సందేశం పంపాడు.
ఇది కూడా చదవండి: బ్రేకప్ సిరి వల్ల కాలేదు.. అసలు కారణం ఇదే: షణ్ముఖ్
అందులో శ్రీహాన్ మాట్లాడుతూ.. ‘సిరిని అర్ధం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది.. నాకు ఇప్పటికీ పడుతుంది కూడా.. సిరికి ఏదైనా గోల్ ఉన్నా.. ఏదైనా సాధించాలి అనుకుంటే.. ఖచ్చితంగా చేస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎవరు అడ్డుపడినా అస్సలు దేకదు. తాను వైజాగ్‌లో ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చి ఏదైనా సాధించాలని అనుకుంది. యాంకర్‌గా కెరియర్ మొదలుపెట్టి.. సీరియల్స్.. సీరియల్స్ నుంచి మూవీస్.. మొన్న బిగ్ బాస్ వరకూ తన కష్టమే. తాను ఎవ్వరి సపోర్ట్ తీసుకోలేదు. తన కష్టంతోనే వచ్చింది. ఎంతమాట్లాడినా అర్ధం చేసుకోవడం మాత్రం చాలా కష్టం’ అంటూ ఎమోషనల్‌గా మాట్లాడి.. సిరి కళ్లు చెమ్మగిల్లేట్టు చేశాడు శ్రీహాన్. ఈ వీడియో చూసిన వారు శ్రీహాన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.