Shraddha Das: ‘‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’’ సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టారు శ్రద్ధాదాస్. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఐదు భాషల్లో 30కిపైగా సినిమాలు చేశారు. గుర్తింపుకు తగ్గ స్థాయిలో మంచి అవకాశాలు రాలేదు. లీడ్ రోల్స్ కంటే ఎక్కువ సెకండ్ లీడ్ రోల్‌లోనో.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో సినిమాలు చేశారు. ప్రస్తుతం అడపాదడపా సినిమాలతో తెలుగు తెరపై తళుక్కన మెరిసి వెళ్లిపోతున్నారు. ఈ బొంబాయ్ ముద్దుగుమ్మ సోషల్‌మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. వీలు చిక్కినప్పుడల్లా అభిమానులతో ఇంటరాక్ట్ అవుతుంటారు.
తరచుగా తన కొత్త కొత్త ఫొటో షూట్‌లకు సంబంధించిన పిక్స్‌ను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా, బ్లాక్ ఫ్లోరల్ ప్రింటెడ్ చీరలో ఆమె దిగిన ఫొటోలను షేర్ చేశారు. ఆ చీరలో ఎంతో అందంగా కనిపిస్తున్నారామె. అందమైన నవ్వుతో.. ప్రశ్నలు వేసే కళ్లతో.. ఓర చూపులతో.. నెటిజన్లను ఫిదా చేస్తున్నారు. మరి, శ్రద్ధా ఫొటోలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#ShraddhaDas looks refreshing in this floral printed outfit. 🖤✨ pic.twitter.com/O6cPGSbbnS
— SumanTV (@SumanTvOfficial) May 17, 2022
ఇవి కూడా చదవండి : Narasimha: నరసింహ మూవీలో సౌందర్య చెంపపై రమ్యకృష్ణ కాలు పెట్టే సీన్ వెనుక ఇంత కథ నడిచిందా?