తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు సురేఖ వాణి. తెలుగులో ఆమె తల్లి, అక్క, వదిన పాత్రలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె కుమార్తె సుప్రీత కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.. గతంలో టిక్ టాక్ వీడియోలు ఇప్పుడు ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ తనదైన శైలిలో ఫాలోవర్స్ ను పెంచుకుంటూ ఉంటుంది. అయితే.., పబ్లిసిటీ కోసం ఓ పురాతన కాలం నాటి ఆలోచన చేసి ఇప్పుడు సుప్రీత విమర్శల పాలు అవుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఇది కూడా చదవండి : ప్రేమలో పడిన సురేఖ వాణి కూతురు సుప్రీత! పిక్స్ వైరల్!
సుప్రీత తన ఇంస్టాగ్రామ్ వేదికగా తన ప్రేమ విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. అతడి ప్రేమకు ఎస్ చెప్పాను అనే క్యాప్షన్ జత చేశారు.ఈ క్రమంలోనే అతడు కూడా సుప్రీతతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ఆమె ఓకే చెప్పింది అనే క్యాప్షన్ ఇచ్చాడు.దీంతో.. వీరి పోస్ట్ లు తెగ వైరల్ అయ్యాయి. కానీ.., ఇప్పుడు సుప్రీత అందరికీ షాక్ ఇస్తూ మరో పోస్ట్ చేసింది.
సుప్రీత తాజాగా.. తాను యస్ చెప్పడం వెనుకున్న కథ ఏంటో బయట పెట్టింది. ఆమె.. రాకీ జోర్డాన్ వెళ్లిపో అనే మ్యూజికల్ ఆల్బం చేస్తోందట.. దానికే యస్ చెప్పేసిందట. ఈ విషయాన్ని సుప్రీత పోస్ట్ చేయడంతో నెటిజన్స్ ఆమెపై మండి పడుతున్నారు. మరి కొంతమంది మాత్రం.. ఇవన్నీ తాతల కాలం నాటి చీప్ ట్రిక్స్ అంటూ సుప్రీత పై మండి పడుతున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి : వైన్ తాగితేనే ఆ ఫీలింగ్స్! సురేఖావాణి కూతురు సంచలన కామెంట్స్!