యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్, ఆయన కుమార్తె శివానీ రాజశేఖర్ కలిసి నటిస్తున్న చిత్రం శేఖర్. మళయాలంలో వచ్చిన జోసెఫ్ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం రాబోతోంది. మరో ఆసక్తిర అంశం ఏంటంటే.. ఈ సినిమాకు జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించింది. ఈ సినిమాలో శివానీ రాజశేఖర్ ఓ ముఖ్యపాత్రలో కనిపించనుంది. ఈ మూవీ మే 20న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లు పెంచేశారు. ఈ సందర్భంగా మే 17 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా శివానీ రాజశేఖర్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యారు. తాను భావోద్వేగానికి గురవుతూ.. అందరిని ఏడిపించారు.
ఈ సందర్భంగా శివానీ రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘‘సినిమా ఇంకో పది రోజుల్లో స్టార్ట్ అవుతుందన్న సమయంలో.. నాన్నకు, నాకు కోవిడ్ వచ్చింది. నాకు మూడు రోజుల్లోనే తగ్గింది. కానీ డాడీకి చాలా సీరియస్ అయింది. నెలన్నర హాస్పిటల్‌లో ఉన్నారు. మా నాన్నకు బాత్రూంకి వెళ్లొచ్చే సమయంలోనే సాట్యురేషన్ పడిపోయేది. ఆయనే మా ఇంటి పెద్ద.. డాక్టర్.. ఆయనే అలాంటి స్థాయిలో ఉన్నప్పుడు.. మాకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు.. జీవితం స్థంభించిపోయినట్టు అనిపించింది’’ అని చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: నా కూతుళ్లు లేచిపోయారంటూ పిచ్చి వార్తలు రాస్తారా: జీవిత
‘‘ఆరేళ్లు నా సినిమా రిలీజ్ అవ్వలేదు.. నేను చాలా డిప్రెషన్‌లోకిపోయాను.. పూజలు చేయమనే వారు.. నన్ను దురదృష్ణవంతురాలని అందరూ అనేవారు.. కానీ నేను నమ్మేదాన్ని కాదు. అయితే నా వల్లే డాడీకి ఇలా అయిందని అన్నప్పుడు మాత్రం నేను దురదృష్ణవంతురాలని అని అనుకున్నా. ఓ రోజు డాక్టర్లు డాడీకి 50-50 చాన్స్ అని అన్నారు. డాడీ నువ్ ఇలా చేయొద్దు.. బయటకు రా.. పోరాడు.. నా వల్ల నీకు ఇలా అయ్యింది.. నేను తట్టుకోలేను’’ అని హాస్పిటల్‌లో ఏడ్చేశాను. అప్పుడు డాడీ మాస్క్ తీసేసి.. నీ వల్ల రావడం ఏంట్రా.. నీ వల్ల కాకపోతే ఇంకెవరి మూలానో వచ్చేది.. నాకేం కాదురా.. అని అన్నారు’’ అని చెప్పుకొస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యింది.
ఇది కూడా చదవండి: మిస్ ఇండియా పోటీల్లో శివానీ రాజశేఖర్.. పోస్ట్ వైరల్!
‘‘నాన్న నెలన్నర పోరాడాడు.. అప్పుడు 75 నుంచి 63 కేజీలు తగ్గాడు. ఆ తరువాత మెల్లిమెల్లిగా కూర్చోవడం, నిల్చోడం, మెట్లు ఎక్కడం, దిగడం, జిమ్ ఇలా అన్నీ నేర్చుకున్నారు.. మళ్లీ 75 వరకు చేరారు.. శేఖర్ మూవీ కోసం రెడీ అయ్యారు.. ఈ సినిమాకు ఈ పాత్రకు స్మోకింగ్ చేయాలి.. లంగ్స్ అప్పటికే పాడైపోయాయి. వద్దని మేం అన్నాం.. కానీ ఆయన మాత్రం చేద్దామని అన్నారు. సినిమాకేం కావాలో అన్నీ చేశారు.. ఈ సినిమా ఎవరి కోసం ఆడినా ఆడకపోయినా మా డాడీ కోసం ఆడుతుందని తెలుసు.. మా డాడీకి ఇది పునర్జన్మ. పునర్జన్మలో ఇది మొదటి చిత్రం’ అని చెప్పుకొచ్చింది. శివానీ మాటలతో ఆమె కాక అక్కడున్న వారంతా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
ఇది కూడా చదవండి: Super Star Krishna: ‘సర్కారు వారి పాట’ సినిమా బాగాలేదు.. అన్నవాళ్ళకు సూపర్ స్టార్ కృష్ణ కౌంటర్!
‘‘శేఖర్ సినిమాకు అనూప్ రూబెన్స్ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. డీఓపీ మల్లిఖార్జున్ గారికి థ్యాంక్స్. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. అరకుని అందంగా చూపించారు. మా నిర్మాతలకు థ్యాంక్స్. మా సినిమా దర్శకురాలు, కెప్టెన్ ఆఫ్ ది షిప్ మా మమ్మి. జీవిత గారు అందరినీ కంట్రోల్ చేస్తుందని అంటారు.. అవేమీ మేం పట్టించుకోం. ఆమెను ఎవరైతే తక్కువ చేయాలని చూస్తారో.. వారందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ సినిమాను అద్బుతంగా తెరకెక్కించింది. నాకు ఈ పాత్ర ఇచ్చినందుకు థ్యాంక్స్’’ అన్నారు. శివానీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.