మనిషి ఎంత సంపాదించినా, ఏం చేసినా సరే అందతా ప్రశాంతంగా బతకడం కోసమే. నచ్చిన ఫుడ్ తింటూ, ఇష్టపడి కట్టుకున్న ఇంట్లో సేదతీరాలని అనుకుంటారు. అందుకోసమే ప్రతి ఒక్కరూ కష్టపడతారు. రూపాయి రూపాయి పోగు చేసి సొంత ఇల్లు కట్టుకుంటారు. లేదంటే కొనుక్కుంటారు. అయితే ఎంతో ముచ్చటపడి కట్టుకున్న ఇల్లు.. గృహప్రవేశం జరగక ముందు కూలిపోయే పరిస్థితి వస్తే.. గుండె ఆగినంత పని అవుతుంది. ఇదిగో ఇలాంటి పరిస్థితే యాంకర్ శివజ్యోతికి ఎదురైంది. ఆ విషయాన్నే చెప్పిన ఆమె.. సదరు ఇంటి డిజైనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వీడియోని కూడా తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీవీ యాంకర్ గా కెరీర్ గా మొదలుపెట్టిన శివజ్యోతి, బిత్తిరి సత్తితో ఈమె చేసిన ‘తీన్మార్’ ప్రోగ్రామ్ చాలా పెద్ద హిట్. దీంతో ఈమెకి చాలా క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ‘బిగ్ బాస్’ మూడో సీజన్ లో పార్టిసిపేట్ చేసింది. ఆ తర్వాత సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుంది. అందులో వీడియోలు చేస్తూ, పలు ఛానెల్స్ లో ప్రోగ్రామ్స్ చేస్తూ బాగానే సంపాదిస్తోంది. ఆర్థికంగా బాగానే సెటిలైపోయింది. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ లోనూ ప్రస్తుతం యాంకర్ గా చేస్తోంది.
ప్రస్తుతం హైదరాబాద్ లో భర్తతో కలిసి ఉంటున్న శివజ్యోతి.. సొంతంగా ఇల్లు కట్టుకుంది. కారు కూడా కొనుక్కుంది. అయితే తన అత్త ఇంటికి కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ల కోసమే కొత్త ఇల్లు కడుతున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియోని పోస్ట్ చేసిన శివజ్యోతి.. ఆ హౌస్ ఇంటీరియర్ పూర్తిగా ఫెయిలైందని ఆవేదన వ్యక్తం చేసింది. సీలింగ్ సరిగా లేదని, కూలిపోవడానికి సిద్ధంగా ఉందని చెప్పింది. అలానే తలుపులకు, బాత్ రూమ్ లో స్టిక్కర్లు అతికించేశారని తెలిపింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారడంతో నెటిజన్స్ పలు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.