ప్రముఖ బాలీవుడ్ సీనియర్ దర్శకుడు, నిర్మాత శివ్ కుమార్ ఖురానా కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రహ్మ కుమారీ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం శివ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఈ నేపథ్యంలోనే 83 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. శుక్రవారం సాయంత్రం ముంబై గురుద్వార శ్రీ గురు సింగ్ సభలో శివ్ కుమార్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక, శివ్ కుమార్ మృతితో బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మరణంపై సంతాపం తెలియజేస్తున్నారు. నటుడు విందు దారా సింగ్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ ‘‘ శివ్ కుమార్ ఖురానా ఎంతో ఉన్నతమైన వ్యక్తి. ఆయన మరణం నుంచి కుటుంబం త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా.
ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక’’ అని పేర్కొన్నారు. కాగా, శివ్ కుమార్ పలు హిట్టు సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మిట్టి ఔర్ సోనా, ఫస్ట్ లవ్ లెటర్, బద్నామ్, బద్కర్, బద్ నషీబ్, బీ ఆబ్రో బేగునాహ్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు! నిర్మాతగా కూడా తన సత్తా చాటారు. తాను దర్శకత్వం వహించిన దగడా దగాబాజ్, హమ్ తుమ్ ఔర్ ఓ, ఆగ్ సే ఆగ్ లగాలే వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ప్రముఖ సీనియర్ హీరో వినోద్ కన్నాను హీరోగా పరిచయం చేసింది కూడా శివ్ కుమారే కావటం విశేషం.
Filmmaker #ShivKumarKhurana passes away at 83https://t.co/FsS4DFlWa2
— India Today Showbiz (@Showbiz_IT) October 28, 2022