జపాన్‌కు చెందిన ప్రముఖ నటుడు ఎన్నోసుకే ఇచికావా టోక్యోలోని తన నివాసంలో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. ఏమైందో ఏమో కానీ, 76 ఏళ్ల ఆయన తండ్రి, 75 ఏళ్ల ఆయన తల్లి
ప్రముఖ జపాన్ నటుడి ఇంట్లో పెను విషాదం చోటుచేసుకుంది. నటుడి తల్లిదండ్రులు ఇంట్లో శవాలు తేలారు. ఈ సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇంట్లోకి చేరుకునే సమయానికి సదరు నటుడు అదే ఇంట్లోని క్లోసెట్‌లో ఆపస్మారక స్థితితో పడి ఉన్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జపాన్‌కు చెందిన ప్రముఖ నటుడు ఎన్నోసుకే ఇచికావా టోక్యోలోని తన నివాసంలో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. ఏమైందో ఏమో కానీ, 76 ఏళ్ల ఆయన తండ్రి, 75 ఏళ్ల ఆయన తల్లి ఇంట్లో శవాలుగా కనిపించారు. ఎన్నోసుకే ఇచికావా కూడా ఆపస్మారక స్థితిలో కనిపించారు. గురువారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ఇంట్లో పోలీసులకు ఓ సూసైడ్ నోట్ లాంటిది కనిపించింది. కుటుంబసమస్యల కారణంగా ముగ్గురు ఆత్మహత్యకు ప్రయత్నించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నటుడి తల్లిదండ్రులు చనిపోగా.. నటుడు మాత్రం ఆపస్మారక స్థితిలో పడిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. నటుడ్ని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయన తల్లిదండ్రుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనుమానాస్పద మృతులుగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.