సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు తమ సౌకర్యం కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేయడానికైనా వెనకాడరు. ఫైవ్ స్టార్ హోటల్స్ రేంజిలో ఇల్లు, లగ్జరీ వాహనాలు, విదేశీ ప్రయాణాలు, సినిమాలు, ఫోటోషూట్స్.. ఇవన్నీ వాళ్లకు మామూలే. ఈ మధ్యకాలంలో ఒక్కో సెలబ్రిటీ కోట్లు పెట్టి లగ్జరీ క్యారీ వ్యాన్ లను కొనుగోలు చేస్తున్నారు. ఏంటి.. కేవలం వ్యాన్ కోసమే కోట్ల రూపాయలా? అని షాక్ అవ్వకండి. సెలబ్రిటీలు.. ఆ మాత్రం లగ్జరీని కోరుకుంటారు.. వారికి కావాల్సిన దానికోసం ఎన్ని కోట్లయినా పెడతారు.
తాజాగా బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి.. తన 47వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంది. అదికూడా తనకు తానుగా ఓ ఖరీదైన లగ్జరీ వ్యాన్ ని బర్త్ డే గిఫ్టుగా సమర్పించుకుంది. ఇంతకీ ఆ వ్యాన్ ఏంటా.. అనుకుంటున్నారా? సూపర్ లగ్జరీయస్ వ్యానిటీ వ్యాన్. దీని ఖరీదు సుమారు రెండు కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఉండే సకల సదుపాయాలన్నీ ఈ వ్యాన్ లో ఉండటం విశేషం. శిల్పా ఎక్కువగా యోగాకు ప్రాధాన్యతనిస్తుంది. కాబట్టి.. సపరేట్ కిచెన్, హెయిర్ వాష్ రూమ్, యోగా డెక్ ఏర్పాటు చేయించుకుంది.బాలీవుడ్ లో ఇలాంటి వ్యాన్ లు చాలామంది సెలబ్రిటీలకు ఉన్నాయి. కానీ లేడీస్ లో శిల్పానే అత్యంత ఖరీదైన వ్యాన్ కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. స్టార్ హీరోల స్థాయిని మించి కోట్లు పెట్టి వ్యానిటీ వ్యాన్ కొని వార్తల్లో నిలిచింది శిల్పా. తెలుగు ప్రేక్షకులకు సాగరకన్యగా ఈ భామ సుపరిచితమే. 50 ఏళ్ళు దగ్గరపడుతున్నా.. నేటితరం కుర్రబ్యూటీలకు ఏమాత్రం తగ్గని అందచందాలు మెయింటైన్ చేస్తోంది. శిల్పా అందానికి ప్రధాన కారణం యోగా అనే చెబుతోంది.
ఇక ప్రయాణం చేసేటప్పుడు కూడా సమయం వృథా కాకూడదని యోగా డెక్ ను లగ్జరీగా ఏర్పాటు చేయించుకుంది. ఇక ఈ వాహనానికి ముందు భాగంలో ఎస్‌ఎస్‌కే అనే అక్షరాలు ఉన్నాయి. ఫైవ్ స్టార్ హోటల్ గదికి ఏమాత్రం తీసిపోని విధంగా ఆమె వ్యానిటీ వ్యాన్ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఆ వ్యాన్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎస్‌ఎస్‌కే అంటే.. శిల్పాశెట్టి కుంద్రా కావచ్చని అంటున్నారు. ఇక బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రాను పెళ్లాడిన శిల్పాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉండగా.. శిల్పా నటించిన లేటెస్ట్ మూవీ ‘నికమ్మ’ జూన్ 17న రిలీజవుతోంది. మరి శిల్పాశెట్టి వ్యానిటీ వ్యాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Shilpa Shetty Kundra gets first-of-its-kind vanity van on birthday. The luxurious vanity van comes with a kitchenette and hair wash station. Meeting Shilpa’s needs and interests, it also comes equipped with a yoga deck. Fitness is very important to her. pic.twitter.com/GKl0KJpJQt
— Hapell Collections (@hapell_India) June 8, 2022