హీరో శర్వానంద్ పెళ్లికి రెడీ అయిపోయాడు. నిశ్చితార్థం క్యాన్సిల్ అయిందనే రూమర్స్ కి చెక్ పెడుతూ ఈ విషయం బయటకొచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారిపోయింది.
హీరో శర్వానంద్ పెళ్లికి రెడీ అయిపోయాడు. ఈ ఏడాది జనవరిలో ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఇతడు.. ఆ తర్వాత దాని గురించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. చెప్పాలంటే సైలెంట్ అయిపోయాడు. దీంతో కొన్నిరోజులుగా శర్వా పెళ్లి క్యాన్సిల్ అయిందని తెగ మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆ పుకార్లకు చెక్ పెడుతూ మ్యారేజ్ డేట్ ని ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ శర్వానంద్ పెళ్లి ఎప్పుడు ఎక్కడ జరగబోతుంది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. 2004లో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శర్వానంద్, కెరీర్ ప్రారంభంలో చిరంజీవి, వెంకటేష్ సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేశాడు. ‘అమ్మ చెప్పింది’ మూవీతో హీరోగా మారిపోయాడు. ఇక ‘గమ్యం’, ‘ప్రస్థానం’ మూవీస్ తో క్రేజ్ సంపాదించాడు. అప్పటి నుంచి సోలో హీరోగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. శర్వానంద్ ‘ఒకేఒక జీవితం’తో చివరగా ప్రేక్షకుల్ని పలకరించాడు. ఇన్నేళ్లు యాక్టింగ్ తో బిజీ అయిపోయిన శర్వా.. ఈ ఏడాది జనవరిలో రక్షిత అనే అమ్మాయితో ఎంగేజ్ మెంట్ చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.
రక్షిత ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా జాబ్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ మనవరాలు. ఈమె తండ్రి మధుసూదన్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో లాయర్ గా చేస్తున్నారు. ఇక శర్వానంద్ పెళ్లి విషయానికొస్తే.. జూన్ 2, 3 తేదీల్లో రాజస్థాన్ లోని లీలా ప్యాలెస్ వేదికగా అంగరంగ వైభవంగా జరగనుందని తెలుస్తోంది. టాలీవుడ్ లోని కొందరు సెలబ్రిటీలకు ఇప్పటికే ఆహ్వానాలు అందినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వస్తే గానీ అసలు విషయం తెలియదు. మరి శర్వానంద్ పెళ్లి తేదీ ఫిక్స్ కావడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.