తెలుగు ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రల్లో నటించి తర్వాత హీరోగా మారిన వారిలో శర్వానంద్ ఒకరు. యువసేన చిత్రంలో చిన్న పాత్రలో కనిపించిన శర్వానంత్ తర్వాత ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ , ‘సంక్రాంతి’, ‘లక్ష్మి’ సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించాడు. ‘రాజు మహారాజు’లో మోహన్‌బాబుతో కలిసి నటించాడు. ‘అమ్మ చెప్పింది’లో మానసికంగా ఎదగని కుర్రాడి పాత్ర లో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్థానం చిత్రం శర్వానంద్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది.
రన్ రాజా రన్ చిత్రంలో హీరోగా నటించి మంచి విజయం అందుకున్నాడు.. స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. హీరో శర్వానంద్ స్టో అండ్ స్టడీగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.వరుస సినిమాలు చేస్తున్న క్రమంలో కొన్ని సినిమాలు విజయాన్ని అందిస్తుంటే, మరి కొన్ని నిరాశపరుస్తున్నాయి. తాజాగా శర్వానంద్ అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహా సముద్రం’ చిత్రం చేశాడు. ఈ చిత్రంలో మరో హీరో సిద్దార్థ్ నటిస్తున్నాడు. గురువారం చిత్రబృందం ట్రైలర్‌ని విడుదల చేసింది.
ఈ కార్యక్రమంలో హీరో శర్వానంద్, కథానాయిక అను ఇమ్మాన్యుయేల్, దర్శకుడు అజయ్ భూపతి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు అభిమానులు వచ్చారు.. వారితో సంతోషంగా ముచ్చటించారు శర్వానంద్. అంతలోనే ఓ అభిమాని వచ్చి శర్వానంద్ తో సెల్ఫీ తీసుకోవాలన్నాడు.. అంతే కాదు మీ జాకెట్ చాలా బాగుంది నాకు ఇస్తారా అని అడిగాడు. వెంటనే తన జాకెట్ విప్పి అభిమాని చేతిలో పెట్టాడు శర్వానంద్. ఆయన మంచితనాన్ని చూసి ఫ్యాన్స్ మైమరచిపోతున్నారు.