రమాప్రభకి నాకు తెలిసిన బంధువు ఆమె తమ్ముడు మాత్రమే. నా కార్ డ్రైవ్ చేస్తూ నాతో తిరిగేవాడు. అతడొక ఉమెనైజర్. నాకు పర్సనల్‌గా చాలా మంది హీరోయిన్లలో కూడా ఫాలోయింగ్ ఉండేది.
అందాల నటుడు శరత్ బాబు ఈ మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. నెలరోజులకు పైగా ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. నటుడిగా ఆయన ఎన్నో పాత్రల్లో మెప్పించారు. హీరోగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. విలన్‌గా కొన్ని వందల పాత్రలు చేశారు. అందాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 5 దశాబ్ధాలుగా పరిశ్రమలో కొనసాగారు. 1973లో ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. రామరాజ్యం శరత్‌బాబు తొలి సినిమా. ఈ సినిమా తర్వాత ఆయన తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.
ఆ తర్వాత 1981లో ఆయన ప్రముఖ నటి రమాప్రభని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే, వీరి కాపురం ఎక్కువ రోజులు నిలువ లేదు. గొడవ కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఈ నేపథ్యంలోనే రమాప్రభ.. శరత్ బాబుపై చాలా ఏళ్ల నుంచి సంచలన కామెంట్లు చేస్తూ వస్తున్నారు. శరత్ బాబు తన ఆస్తులు కాజేశాడని, ఆయన వ్యక్తిత్వం లేని మనిషని అన్నారు. అయితే, శరత్ బాబు వర్సన్ మాత్రం వేరేలా ఉంది. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ రమాప్రభకి రూ 60 కోట్ల ఆస్తి ఇచ్చా. మీరంతా నన్ను విమర్శిస్తున్నారు. కానీ నేను అప్పట్లో నా ఆస్తి అమ్మి రమాప్రభ పేరు మీద ఒక ప్రాపర్టీ, ఆమె తమ్ముడి పేరుమీద మరొకటి, ఇద్దరి పేరుమీద మరొకటి ఇలా మూడు ప్రాపర్టీలు కొనిచ్చా.
రమాప్రభకి నాకు తెలిసిన బంధువు ఆమె తమ్ముడు మాత్రమే. నా కార్ డ్రైవ్ చేస్తూ నాతో తిరిగేవాడు. అతడొక ఉమెనైజర్. నాకు పర్సనల్‌గా చాలా మంది హీరోయిన్లలో కూడా ఫాలోయింగ్ ఉండేది. కొందరు హీరోయిన్లు ప్రేమించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ప్రజలందరికి తెలియడం కోసం చెబుతున్నా. అప్పట్లో నా వయసు 22 ఏళ్ళు. రమాప్రభ నాకంటే వయసులో 7 ఏళ్ళు పెద్దది. కాలేజీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చా. ప్రపంచం గురించి తెలియని వయసులో ఆమెతో పరిచయం ఏర్పడింది. ఆ వయసులో ఎలాంటి అనుభవం లేకుండా ఆ తప్పు చేశా’’ అని అన్నారు.