విజయ నిర్మల మనవడు శరణ్ కుమార్ మిస్టర్ కింగ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. పాటలు, ట్రైలర్ యువతను ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరి 24న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
విజయ నిర్మల ఫ్యామిలీ నుంచి మరో హీరో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. నరేశ్ కజిన్ రాచ్ కుమార్ కుమారుడు శరణ్ కుమార్ ‘మిస్టర్ కింగ్’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఓ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో శరణ్ కుమార్ అలరించనున్నాడు. ఈ మూవీకి శశిధర్ చావలి దర్శకత్వం వహిస్తుండగా.. ఈ సినిమాని హన్విక క్రియేషన్ బ్యానర్ మీద బీఎన్ రావు నిర్మించారు. శరణ్ కుమార్ సరసన యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్ నటించారు. ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ అందించారు. ఫిబ్రవరి 24న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది.
మిస్టర్ కింగ్ సినిమా ట్రైలర్ ముఖ్యంగా కుర్రకారును బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకి యూత్ లో మంచి బజ్ ఏర్పడింది. ఎందుకంటే మనం లైఫ్ లో ప్రతి విషయంలో కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. కానీ, కాంప్రమైజ్ కాకుండా కూడా మన గోల్స్ రీచ్ కావచ్చు, ప్రేమించిన అమ్మాయిని పొందచ్చనే విధంగా ఈ కథ ఉండబోతోంది. అబ్బాయిల ఆత్మగౌరవం అనే లైన్ అందరికీ బాగా నచ్చింది. ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో వైరల్ గా మారింది. ఈ సినిమాకి మంచి బజ్ ఏర్పడటమే కాదు.. ఓపెనింగ్స్ కూడా బాగా వస్తాయని టాక్ వినిపిస్తోంది. శరణ్ కుమార్ మంచి కథతో డెబ్యూ చేస్తున్నాడు అంటూ క్రిటిక్స్ సైతం కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
ఆత్మాభిమానం ఉన్న ప్రతి అబ్బాయి చూడాల్సిన సినిమా ఇది అని చెబుతున్నారు. తన గోల్ రీచ్ కావడం, ప్రేమించిన అమ్మాయిని పొందడంలో హీరోకి ఎన్ని అడ్డంకులు ఎదురయ్యాయి? ఎక్కడా తన ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టకుండా తన గోల్స్ ఎలా రీచ్ అయ్యాడు అనేదే కథ. మనం ఇన్నాళ్లు చాలా సినిమాల్లో ప్రేమించిన అమ్మాయి కోసం అబ్బాయి ఫైట్ చేయడం చూశాం. కానీ, ఈ సినిమాలో మాత్రం అమ్మాయి ప్రేమకోసం ఆమే ఫైట్ చేయడం చూస్తాం. ఇంక సినిమాలో ట్విస్టులు బోలెడు ఉన్నట్లు ట్రైలర్ చూస్తనే అర్థమైపోతుంది. తనికెళ్ల భరణి, సునీల్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ వంటి సీనియర్ యాక్టర్స్ చాలామందే ఉన్నరు.