టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ కాస్త తగ్గాయనే చెప్పాలి. అలాంటి సమయంలో శరణ్ కుమార్ మిస్టర్ కింగ్ పేరిట ఓ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను పలకరించనున్నాడు.
మిస్టర్ కింగ్’ సినిమాతో విజయ నిర్మల మనవడు శరణ్ కుమార్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. నరేశ్ కజిన్ రాజ్ కుమార్ కుమారుడే శరణ్ కుమార్. ఈ మూవీకి శశిధర్ చావలి దర్శకత్వం వహిస్తున్నాడు. ఓ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ‘మిస్టర్ కింగ్’ రాబోతోంది. ఫిబ్రవరి 24న విడుదల కానున్న ఈ సినిమాని హన్విక క్రియేషన్ బ్యానర్ మీద బీఎన్ రావు నిర్మించారు. హీరోయిన్స్ గా యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్ నటించారు. ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ అందించగా.. ఇప్పటికే పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అలాగే తాజాగా విడుదలైన మిస్టర్ కింగ్ టీజర్ కు కూడా గ్రేట్ రెస్పాన్స్ వచ్చింది. మరి.. ఆ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.
ఈ ట్రైలర్ చూసిన తర్వాత కలిగే మొదటి అభిప్రాయం ఏంటంటే.. ఆత్మాభిమానం ఉన్న ప్రతి అబ్బాయ్ చూడాల్సిన సినిమా ఇది. హీరోకి ఒక గోల్ ఉంటుంది. ప్రాజెక్ట్ వాయు పేరిట ఓ హెబ్రిడ్ ఇంజిన్ తయారు చేయాలని చూస్తాడు. అలాగే హీరో లైఫ్ లో లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఇప్పటివరకు అమ్మాయి కోసం, తమ ప్రేమ కోసం అబ్బాయిలు ఫైట్ చేయడం చూశారు. కానీ, ఇక్కడ మాత్రం ఫర్ ఏ ఛేంజ్.. తన ప్రేమ కోసం మొట్ట మొదటిసారి అమ్మాయే ఫైట్ చేయబోతోంది. ఈ సినిమాలో గోల్, లవ్, ఛాలెంజెస్ ఇలా చాలానే ఉన్నాయి. తన ఆత్మాభిమానాన్ని వదులుకోకుండా, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తన లక్ష్యాలను ఎలా చేరుకున్నాడు అనేదే కథగా తెలుస్తోంది.
ఇంక సినిమాలో ట్విస్టులు, మలుపుల విషయానికి వస్తే బోలెడన్ని ఉన్నట్లు ట్రైలర్ చూసిన ఎవరికైనా అర్థమైపోతుంది. ఇంక తనికెళ్ల భరణి, మురళీ శర్మ, సునీల్, ఎస్ఎస్ కంచి, వెన్నెల కిషోర్ అంటూ తారాగణం చాలా పెద్దగానే ఉంది. నిజానికి ఈరోజుల్లో ఒక అర్జున్ రెడ్డిలాంటి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ రావడం లేదనే చెప్పాలి. యువత ఎలా ఉండాలి? వాళ్ల గోల్స్ అఛీవ్ చేయడం, ముఖ్యంగా సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోకుండా జీవితాన్ని ఎలా లీడ్ చేయాలి అనే అంశాలను టచ్ చేయడం తగ్గించేశారు. కానీ, ఈ మిస్టర్ కింగ్ మాత్రం తప్పకుండా గేమ్ ఛేంజర్ అవుతుందని సినిమా బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.