సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది యువతీ యువకులు రాత్రికి రాత్రే సెలెబ్రిటీలుగా మారిపోతున్నారు. తద్వారా ఫాలోయింగ్ పెంచుకొని బిగ్ బాస్ వంటి ఆఫర్లూ పట్టేస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ఒకరు. పలు వెబ్ సిరీసులతో పాటు యూట్యూబ్ షాట్స్ ద్వారా ఫేమస్ అయిన షణ్ముఖ్ జశ్వంత్.. సీజన్- 5లో బిగ్ బాస్ లోకి వెళ్లి రన్నరప్ గా నిలిచాడు. ఆ మ్యాటర్ పక్కనపెడితే.. ప్రస్తుతానికి షణ్ముఖ్ జశ్వంత్ ఆస్పత్రి పాలయ్యాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం షణ్ముఖ్ జశ్వంత్ ఆరోగ్య పరిస్థితి బాగోలేని కారణంగా హాస్పిటల్ అడ్మిట్ అయినట్లు వార్తలోస్తున్నాయి. అందుకు తగ్గట్టు జశ్వంత్ పోస్ట్ చేసిన ఫోటో కూడా అభిమానులను మరింత కలవరపెడుతోంది. అయితే.. కొద్దిసేపటి క్రితమే షణ్ముఖ్ జశ్వంత్ “ఐ యాం ఫైన్” ‘నేను బాగున్నాను..’ అంటూ పోస్ట్ పెట్టడంతో అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు .
డ్యాన్స్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్‌లు, వెబ్ సిరీస్‌లో నటిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్, సినీ స్టార్స్ కు ధీటుగా అభిమానులను సంపాదించుకున్నాడు. తద్వారా సీజన్- 5లో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ తన ఆటతీరుతో ఎంత మంది అభిమానులను సంపాదించుకున్నాడో.. సిరితో ప్రవర్తించిన తీరుతో అంతే స్థాయిలో విమర్శకులను పెంచుకున్నాడు. అంతేకాదు.. తన తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన దీప్తి సునయనను కూడా వదులుకునే పరిస్థితులు తెచ్చుకున్నాడు. ప్రస్తుతానికి మళ్లీ షార్ట్ ఫిల్మ్‌లలో నటిస్తూ.. అందరిని మెప్పిస్తున్నాడు.