యూట్యూబ్ సెన్సేషన్, బిగ్ బాస్ తెలుగు 5 రన్నరప్ షణ్ముఖ్ జశ్వంత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. వెబ్ సిరీస్ల తర్వాత బిగ్ బాస్ ద్వారా తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు. అయితే బిగ్ బాస్ తో అతనికి ఎంత ఫేమ్ వచ్చిందో.. అంతే చిక్కులు కూడా వచ్చాయి. దీప్తీ సునైనా- షణ్నూని వద్దనుకుంది. అయితే ఇంక షణ్ముఖ్ తన లవ్ గురించి కాకుండా.. కెరీర్ మీద దృష్టి పెట్టాడు. త్వరలోనే వెండితెర మీద కూడా కనిపించనున్నాడనే టాక్ ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ డాన్సింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షణ్నూ పక్కనున్న అమ్మాయి ఎవరు అంటూ వెతుకులాట మొదలు పెట్టారు.
ఇదీ చదవండి: RRR ఈవెంట్ చిక్కబళ్లాపూర్ లో ప్లాన్ చేయడానికి కారణమేంటి..?
షణ్ముఖ్ తో స్టెప్పులేసన అమ్మాయి మరెవరో కాదు.. హీరోయిన్ నువేక్షా. ఇద్దరూ కలిసి రీసెంట్ యూట్యూబ్ సెన్సేషన్ బీస్ట్ మూవీలోని అరబిక్ కుతు సాంగ్ కు స్టెప్పులు ఇరగదీశారు. వీళ్ల డాన్సు చూసి షణ్ముఖ్ ఫ్యాన్స్ అంతా వేరే లెవర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరైతే షణ్నూ ఈజ్ బ్యాక్ అంటూ ఆనందపడిపోతున్నారు. ఇంక నువేక్షా విషయానికి వస్తే అతిథిదేవో భవ, సెబాస్టియన్ చిత్రాల్లో నటించింది. షణ్ముఖ్ వెండితెర అవకాశాలు గురించి టాక్ వస్తున్న సమయంలో హీరోయిన్ తో కలిసి స్టెప్పులేస్తున్నాడు. అంటే షణ్ముఖ్ డెబ్యూ చిత్రంలో హీరోయిన్ గా నువేక్షా నటించబోతోందేమో అనే అనుమానాలు మొదలయ్యాయి. క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేదాకా ఆగాల్సిందే. షణ్నూ- నువేక్ష డాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.