బిగ్ బాస్ కొత్త సీజన్ సందడి మొదలైపోయింది. 5వ సీజన్ తర్వాత రాబోతున్న ఈ కొత్త సీజన్ OTT వెర్షన్ కావడంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరికి ఆసక్తికరంగానే ఉంది. అదీగాక ఈ ఓటిటి సీజన్ 1, 2 కాకుండా 24 గంటలపాటు ప్రసారం కాబోతుంది. అయితే.. కొందరు ఓటిటి సీజన్ అయినా త్వరగా మొదలవుతుందని సంతోషిస్తుంటే.. మరికొందరేమో మొన్నే కదరా గబ్బు చేసుకున్నారు. అప్పుడే కొత్త సీజనా..? అంటూ షాక్ అవుతున్నారు.
ఫిబ్రవరి 26 నుండి డిస్నీ హాట్ స్టార్ లో బిగ్ బాస్ ఓటీటీ ప్రసారం కానుంది. ఈ ఓటీటీ సీజన్ కి కూడా నాగార్జునే హోస్ట్. దాదాపు 12 వారాలు వ్యవధితో ప్లాన్ చేసిన ఓటిటి సీజన్.. బాగా క్లిక్ అయితే మాత్రం మరిన్ని ఎక్కువ రోజులు షోని కొనసాగించే ఆలోచన చేస్తున్నారట. ఈ ఓటిటి సీజన్ లో మొత్తంగా సోషల్ మీడియా లో పాపులర్ అయినవారినే కాకుండా.. కాస్త పకడ్బందీగా గత సీజన్లలో పాల్గొన్న వారిని కూడా సెలెక్ట్ చేయడం విశేషం.ఇదిలా ఉండగా.. తాజాగా బిగ్ బాస్ లో పాల్గొనేవారి లిస్ట్ ఇదేనంటూ 17 మంది పేర్లు బయటికి వచ్చాయి. ఆ లిస్టులో ఉన్నవారెవరూ ఇంతవరకు తాము బిగ్ బాస్ ఓటిటిలో పాల్గొనబోతున్నట్లు ప్రకటించలేదు. కానీ ఒక్కరి పేరు మాత్రం కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. 5వ సీజన్ రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్.. బిగ్ బాస్ ముగిసిన అనంతరం యాంకర్ శివతో ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఈ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు షేర్ చేసుకున్న షణ్ముఖ్ మధ్యమధ్యలో.. ‘నువ్ కూడా వెళ్తావ్ గా తెలుస్తుందిలే.. ఇంటర్వ్యూల కోసం అడిగితే స్పేస్ కావాలన్నాను. నేను ఎందుకు స్పేస్ కావాలన్నానో నీకు త్వరలో అర్ధం అవుతుంది. అలాగే శివని ఏదైనా అడగాలి అనుకుంటే ఇప్పుడే అడిగేయండి.. నెల రోజుల తర్వాత ఎలాగో కనిపించడు’ అని నవ్వుతూ అసలు విషయాన్ని లీక్ చేసేశాడని సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఓ రకంగా యాంకర్ శివని షణ్ముఖ్ హింట్ ఇచ్చి కన్ఫర్మ్ చేశాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి యాంకర్ శివ ఎంట్రీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.