తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ‘చిరుత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. రెండో చిత్రం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ సెన్సేషన్ హిట్ అయ్యింది. ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ ఏడాది రామ్ చరణ్, యన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా రిలీజై కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు రామ్ చరణ్. ఈ చిత్రానికి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ మద్యనే షెడ్యూల్ రాజమండ్రి, హైదరాబాద్ లలో పూర్తి చేశారు.
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ఈ చిత్రం భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగు నిర్మాతలు అయిన దిల్ రాజు, శిరీష్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత షెడ్యూల్ న్యూజిలాండ్ లో ప్లాన్ చేసినట్లు సమాచారం. రామ్ చరణ్, కియారా అద్వానిపై ఓ రొమాంటిక్ సాంగ్ ని చిత్రీకరించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ పాటకు సంబంధించిన ఓ సెన్సేషనల్ న్యూస్ ఫిలిమ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. సాధారణంగా డైరెక్టర్ శంకర్ సాంగ్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కారు.. చాలా రిచ్ గా ప్లాన్ చేస్తుంటారు. అందుకే ఆయన చిత్రాల్లోని సాంగ్స్ సూపర్ హిట్ అందుకుంటాయి.
రామ్ చరణ్, కియారా అద్వానిపై తీయబోయే రొమాంటిక్ సాంగ్ కి ఏకంగా రూ.23 కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్లు.. ఇండియన్ మూవీస్ లో ఎప్పటికీ మర్చిపోలేనంత గొప్పగా ఈ పాట చిత్రీకరించబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. కాకపోతే దీనిపై ఎలాంటి అఫిషియల్ న్యూస్ బయటకు రాలేదు.. నిజా నిజాల సంగతి ఎలా ఉన్నా.. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి పాట ప్లాన్ చేస్తున్నారంటే.. అది ఏ రేంజ్ లో ఉండబోతుందో అని తెగ ఆనందపడుతున్నారు మెగా ఫ్యాన్స్.
ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతుంది. ప్రముఖ డైరెక్టర్ ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, సునీల్ లాంటి స్టార్ నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. శంకర్ తెరకెక్కించిన ప్రతి చిత్రంలో ఏదో ఒక మెసేజ్ తప్పకుండా ఉంటుంది.. మరీ ఈ చిత్రంతో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతున్నాడో చూడాలి.