Shamita Shetty And Raqesh Bapat: సినిమా ఇండస్ట్రీలో వరుస బ్రేకప్‌లు చోటుచేసుకుంటున్నాయి. ఎంతోకాలం కలిసున్న జంటలు సైతం తమ బంధానికి స్వప్తి పలుకుతున్నాయి. మొన్నీమధ్య ప్రముఖ బాలీవుడ్ నటి సుష్మిత సేన్, రోహ్‌మన్ శాల్‌లు బ్రేకప్ చెప్పుకుని ఫ్రెండ్స్‌గా మిగిలిపోయారు. ఆ తర్వాత అనన్య పాండే, ఇశాన్ ఖట్టర్‌లు కూడా బ్రేకప్ చెప్పుకున్నారు. తాజాగా, వీరి బాటలోకే మరో జంట చేరింది. ప్రముఖ బాలీవుడ్ నటీనటులు షమితా శెట్టీ, రాకీష్ బాపట్‌లు బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ విషయాన్ని తమ సోషల్ మీడియా ఖాతాల్లో పబ్లిక్‌గా అనౌన్స్ చేశారు.
ఇద్దరూ తమ బ్రేకప్‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల ద్వారా తెలియజేశారు. షమితా శెట్టీ తన స్టోరీలో.. ‘‘ నేను, రాకీష్ విడిపోయాం. మాకు ఇన్నిరోజులు సపోర్టు చేసిన ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు. మేము విడిపోయి వేరుగా ఉన్నా కూడా మీ సపోర్టు ఉంటుందని ఆశిస్తున్నాను’’ అని పేర్కొంది. ఇక, రాకీష్ తన స్టోరీలో.. ‘‘ నేను, షమితా విడిపోయాం. విధి మమ్మల్ని ఎక్కడకో తీసుకుపోయి నిలబెట్టింది. నేనో ప్రైవేట్ పర్సన్.. ఇలా మేము వేరుపడటం గురించి పబ్లిక్‌గా చెప్పటం నాకు ఇష్టం ఉండదు.
కానీ, ఫ్యాన్స్‌కు చెప్పక తప్పటం లేదు. ఇది మీకు ఇబ్బంది కలిగిస్తుందని నాకు తెలుసు. అయినప్పటికి, మేము విడిపోయి వేరుగా ఉన్నా కూడా మీ సపోర్టు ఉంటుందని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నాడు. ఇద్దరూ తమ ఫ్యాన్స్ కోసం ఓ మ్యూజిక్ వీడియోను విడుదల చేశారు. మరి, ఈ జంట విడిపోయి వేరుపడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— Shamita Shetty 🦋 (@ShamitaShetty) July 26, 2022
ఇవి కూడా చదవండి : వంశీ పైడిపల్లి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మహేష్ బాబు..