షకీల మలయాళంతో పాటు తెలుగు, తమిళంలోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు పలు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు...
షకీల.. ఈ పేరుతో ఇండియన్ సినిమా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. 1990, 2000లలో తన అడల్ట్ సినిమాలతో దేశ వ్యాప్తంగా పిచ్చ పాపులారిటీ తెచ్చుకున్నారామె. అప్పట్లో మలయాళంలో స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. కానీ, గత 15 ఏళ్ల నుంచి అడల్ట్ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తున్నారు. ఓ వైపు సినిమాలు, షోలు చేస్తూనే మరో వైపు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సమస్య ఉన్న చోటుకు వెళ్లి దాన్ని పరిష్కరించటానికి తన వంతు కృషి చేస్తున్నారు. తాజాగా, షకీల బ్యాచిలర్స్‌కు అండగా నిలిచారు.
చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వారి కోసం నిరసన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని జులైమేట్‌లో చిత్ర అపార్ట్‌మెంట్స్ ఉంది. ఈ అపార్ట్‌మెంట్‌లో పెద్ద సంఖ్యలో బ్యాచిలర్స్ ఉంటున్నారు. అపార్ట్‌మెంట్ యజమాన్యం బ్యాచిలర్స్ నుంచి అక్రమంగా మెయింటెన్స్ వసూలు చేస్తోంది. దాదాపు 9 వేల రూపాయలు వీరినుంచి తీసుకుంటోంది. ఈ విషయం గురించి తెలిసి, ‘‘అంతమొత్తం మెయిన్‌టెనెన్స్ కట్టమూ’’ అని బ్యాచిలర్స్ తెగేసి చెప్పగా అరాచకానికి దిగుతున్నారు. కేవలం వారికి మాత్రమే నీళ్లు రాకుండా చేశారు. దీంతో గత మూడు రోజులనుంచి వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దీంతో వారు నిరసనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న షకీల అపార్ట్‌మెంట్ దగ్గరకు వచ్చారు. బ్యాచిలర్స్‌కు మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. షకీల బ్యాచిలర్స్‌కు మద్దతు తెలుపుతుండటంతో మీడియాలో సైతం దీని గురించి వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో సదరు బ్యాచిలర్స్‌కు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. అపార్ట్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షకీల మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి, బ్యాచిలర్స్‌కు మద్దతుగా నిలిచిన షకీలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.