సినీ సెలబ్రిటీలపైనే కాదు.. ఇండస్ట్రీలోకి వస్తున్నారంటే వాళ్ళ పిల్లలు కూడా ట్రోల్స్ ఫేస్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఎంత పెద్ద స్టార్ తనయుడు/తనయ ఎవరైనా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఎలా ఉన్నా.. మీడియా ముందుకు వచ్చేముందు జాగ్రత్తగా నడుచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఈరోజుల్లో సోషల్ మీడియా అనేది చాలా పవర్ ఫుల్ అయిపోయింది. గుడ్ నేమ్ – బ్యాడ్ నేమ్ రెండూ సోషల్ మీడియానే తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా సినిమాల్లోకి వచ్చే ప్లాన్ లో సెలబ్రిటీల వారసులు.. మోడరన్.. పాష్ లైఫ్ స్టైల్ ని, డ్రెస్సింగ్ సెన్స్ ని ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ, డెబ్యూ చేయబోయే వారికి అంత స్టైల్ అవసరం లేదని అంటున్నారు నెటిజన్స్.
తాజాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. 22 ఏళ్ళ సుహానా.. త్వరలో బాలీవుడ్ డెబ్యూ చేసేందుకు రెడీ అవుతోంది. పాపులర్ డైరెక్టర్ జోయా అక్తర్ తెరకెక్కించిన ‘ది ఆర్చీస్’ వెబ్ సిరీస్ ద్వారా సుహానా ఎంట్రీ ఇవ్వనుందట. అయితే.. ఇటీవలే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ముగియడంతో టీమ్ తో కలిసి ఓ పార్టీలో పాల్గొంది. ఈ పార్టీలో సుహానాతో పాటు సిరీస్ లో నటించిన శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్, అగస్త్య నందా, మిహిర్ అహూజా, వేదంగ్ రైనా, యువరాజ్ మెండా.. ఇంకా యూనిట్ పాల్గొన్నారు. ఇక పార్టీ మూడ్ లో అందరూ కెమెరాలకు స్టైల్ గా ఫోజులిచ్చారు.
ఈ క్రమంలో సుహానాకి సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో పార్టీలో పాల్గొన్న ఎవరిపై రాని ట్రోల్స్.. సుహానాపై మొదలయ్యాయి. ప్రత్యేకించి సుహానా వాకింగ్ స్టైల్ పై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. సుహానా వాకింగ్ స్టైల్.. ఐటమ్ హీరోయిన్ మలైకా అరోరాలా ఉందని.. ఆమెను చూసి నేర్చుకుందా ఏంటి? అని కామెంట్స్ చేస్తున్నారు. అంతేగాక బాలీవుడ్ లేడీ సెలబ్రిటీలంతా హాలీవుడ్ కి చెందిన కర్దాషియన్ సిస్టర్స్ ని ఫాలో అవుతున్నారని.. సుహానా అయితే ఏకంగా మలైకా 2 అంటూ ట్రోల్స్ చేయడం గమనార్హం. బాడీ ఫిట్ రెడ్ కలర్ అవుట్ ఫిట్స్.. బ్లాక్ హీల్స్, హూప్ ఇయర్ రింగ్స్, హెయిర్ స్టైల్ తో అందంగా కనిపించింది. మరి ఎందుకు ట్రోల్ చేసేంత విషయం అక్కడ ఏముందా అని మరికొందరి అభిప్రాయం. మరి షారుఖ్ కూతురు సుహానా బాలీవుడ్ డెబ్యూ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.