శంకర్ డైరెక్షన్ లో షారుఖ్ – విజయ్ భారీ మల్టీస్టారర్?

సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ స్టార్ డైరెక్టర్ తో ఓ స్టార్ హీరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించగానే ఆ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో పెరుగుతాయి. మరి ఇద్దరు స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్ తో కలిస్తే ఇండస్ట్రీ రికార్డులు షేక్ అవ్వాల్సిందే.

  • Written By:
  • Publish Date - February 13, 2023 / 11:07 AM IST

చిత్ర పరిశ్రమలో కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఓ స్టార్ డైరెక్టర్ తో ఓ స్టార్ హీరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించగానే ఆ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో పెరుగుతాయి. ఇక ఇద్దరు స్టార్ హీరోలతో మరో స్టార్ డైరెక్టర్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు అని తెలిస్తే.. బాక్సాఫీస్ రికార్డులు షేక్ అవ్వడం ఖాయమే. ప్రస్తుతం అలాంటి బాక్సాఫీస్ బద్దలయ్యే వార్తే ఒకటి దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తాడు డైరెక్టర్ శంకర్. అలాంటి శంకర్ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ తో పాటు దళపతి విజయ్ లు కలిసి నటిస్తున్నారు అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

డైరెక్టర్ శంకర్.. భారీ బడ్జెట్ చిత్రాలకు పెట్టింది పేరు. అలా అని కంటెంట్ లేని సినిమాలు తియ్యరు శంకర్. సగటు సినీ ప్రేక్షకుడు ఏది ఆశించి సినిమాకు వస్తాడో అన్ని అంశాలు సినిమాలో ఉండేలా జగ్రత్తపడతాడు. ఇక ప్రస్తుతం శంకర్ అటు కమల్ హాసన్ తో ఇండియన్ 2, ఇటు రామ్ చరణ్ తో RC15 తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు చిత్రాల తర్వాత శంకర్ ఓ భారీ మల్టీస్టారర్ చెయ్యబోతున్నారు అన్న వార్త ఒకటి సినిమా పరిశ్రమలో జోరుగా వినిపిస్తోంది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, దళపతి విజయ్ కాంబినేషన్ లో ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడని సమాచారం. ఇక ఈ సినిమా బడ్జెట్ వింటే షాక్ అవ్వాల్సిందే. ఈ భారీ మల్టీస్టారర్ ను ఏకంగా రూ. 900 కోట్లతో తెరకెక్కించేందుకు సన్నాహాకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఇందుకోసం రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు ముందుకు వచ్చాయని పరిశ్రమలో వినికిడి. ఇక ఈ సినిమా కథ అండర్ వాటర్ లో జరిగే సాంకేతికథకు సంబంధించినదిగా తెలుస్తోంది. వీరిద్దరు కలిసి నటించడానికి బలమైన కారణాలు లేకపోలేదు అంటున్నారు అభిమానులు. ప్రస్తుతం షారుఖ్ నటిస్తున్న ‘జవాన్’ సినిమాలో అతిథి పాత్ర చేస్తున్నాడు దళపతి విజయ్. దాంతో ఆ స్నేహంతోనే త్వరలో వీరిద్దరు కలిసి నటించే అవకాశాలు ఎక్కుగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగానే ఈ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి శంకర్ డైరెక్షన్ లో షారుఖ్-విజయ్ నటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV