సాధారణంగా స్టార్ హీరో లేదా నిర్మాతల వారసులు చాలావరకు హీరో లేదా హీరోయిన్ కావాలనుకుంటారు. ప్రస్తుతం ఏ సినీ పరిశ్రమ చూసుకున్నా సరే దాదాపు ఇలానే ఉంటుంది. చాలా తక్కువ మంది మాత్రమే వేరే రంగాల్లోకి వెళ్తారు. కొందరు బిజినెస్ ల్లోకి వెళ్తారు. మరికొందరు పెళ్లి చేసుకుని సెటిలైపోతారు. కానీ ఓ స్టార్ హీరో కొడుకు మాత్రం వోడ్కా కంపెనీ ప్రారంభించడానికి రెడీ అయిపోయాడు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా వైరల్ గా మారాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సినిమా లవర్స్ కు షారుక్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పుడంటే సరైన హిట్ లేకపోవడం వల్ల ఆయన బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడం లేదు. కానీ ఒకప్పుడు బాలీవుడ్ మొత్తం షారుక్ మేనియా వినిపించేంది. ఇక షారుక్ కూతురు సుహానా ఇప్పటికే ‘ఆర్చీస్’ అనే వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తోంది. ఇక షారుక్ కొడుకు ఆర్యన్ మాత్రం తండ్రి రూట్ లో కాకుండా డిఫరెంట్ గా వెళ్లాలని ఫిక్సయ్యాడు. అందులో భాగంగానే డైరెక్టర్ అవుతున్నానంటూ రీసెంట్ గా ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఇప్పుడు మరో ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.
తన ఫ్రెండ్స్ తో కలిసి ఆర్యన్ ఖాన్.. ప్రీమియం వోడ్కా బ్రాండ్ ని స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ బిజినెస్ కోసం ఆర్యన్.. ఓ ప్రముఖ బెవరేజెస్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారట. బంటీ సింగ్, లేటీ బ్లోగవాతో కలిసి ఆర్యన్.. ప్రీమియం వోడ్కా బ్రాండ్ ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడని మింట్ పత్రిక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ‘శ్లాబ్ వెంచర్స్’ పేరుతో ఆర్యన్ ఓ కంపెనీ స్టార్ట్ చేశాడని, ప్రపంచంలోనే అతిపెద్ద బ్రూవరేజి కంపెనీ ‘ఏబీ ఇన్ బెవ్’తో భాగస్వామ్యం కుదుర్చుకున్నారట. దీన్నిబట్టి చూస్తుంటే తండ్రిలా యాక్టర్ కాకుండా డైరెక్టర్ కమ్ బిజినెస్ మేన్ కావాలని ఆర్యన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరి ఆర్యన్, వోడ్కా బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.