బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బిగ్ సక్సెస్ ని రీసెంట్ గా ‘పఠాన్’ మూవీ అందించింది. చెన్నై ఎక్స్ ప్రెస్ లాంటి బిగ్ హిట్ తర్వాత షారుఖ్ నుండి ఆ స్థాయి మూవీ రాలేదు. మధ్యలో చాలా సినిమాలు చేసినప్పటికీ, వాటి ఫలితాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఇలాంటి టఫ్ టైమ్ లో పఠాన్ సినిమా చేశాడు. భారీ స్పై యాక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా.. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. పైగా కలెక్షన్స్ పరంగానూ పలు రికార్డులను సెట్ చేస్తూ దూసుకుపోతుంది.
యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమాలో షారుఖ్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది. జాన్ అబ్రహం విలన్ గా నటించాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో మెరిసి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశాడు. అయితే.. పఠాన్ మూవీ రిలీజ్ కి ముందు ఎన్నో వివాదాలను ఫేస్ చేసినప్పటికీ.. పాజిటివ్ టాక్ వచ్చాక ట్రోల్స్ అన్నింటికి ఫుల్ స్టాప్ పడిపోయింది. ముఖ్యంగా షారుఖ్ ఫ్యాన్స్ కి పఠాన్ మూవీ ఫుల్ కిక్ ఇచ్చిందని చెప్పవచ్చు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషలలో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయిన పఠాన్.. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ మూడు రోజుల్లో రూ. 313 కోట్లు వసూల్ చేయడం విశేషం.
అదీగాక రూ. 165 కోట్లకు పైగా నెట్ వసూల్ చేసి రికార్డు సెట్ చేసింది. ఇక నాలుగో రోజు పఠాన్ దూకుడు కొనసాగింది. నాలుగో రోజుతో ఏకంగా రూ. 410 కోట్లకు పైగా గ్రాస్, రూ. 214 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ నమోదు అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో పఠాన్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న షారుఖ్.. సరదాగా సోషల్ మీడియాలో నెటిజన్స్ తో ముచ్చటించాడు. నెటిజన్స్ అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పిన షారుఖ్.. మీరు ప్రమోషన్స్ లో ఎందుకు పాల్గొనరు? అనే ప్రశ్నకు “సింహాలు ఇంటర్వ్యూలలో పాల్గొనవు. నేను కూడా అంతే” అన్నాడు. అలాగే సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, పఠాన్ యూనిట్ కి థాంక్స్ చెప్పాడు. ప్రస్తుతం షారుఖ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి పఠాన్ మూవీపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.