‘దిల్ వాలే దుల్హానియా లే జాయేంగ్’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాజోల్, షారుఖాన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద సంచలనమో అందరికి తెలిసిందే. ఇప్పటికి అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాల్లో ఈ సినిమా ఒకటి.ఈ మూవీ అప్ట్లో అనేక రికార్డులను సృష్టించింది. సినిమా ఎక్కువకాలం థియేటర్లలో ప్రదర్శింపబడిన చిత్రంగా కూడా ఎన్నో రికార్డులు సాధించింది. అక్టోబర్ 20 1995 లో విడుదలైన ఈ సినిమాలో షారుక్, కాజోల్ జంట కెమిస్ట్రీకి ప్రేక్షకులు అబ్బురపడ్డారు. గతంలో ఓ సారి ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేశారు. అయితే తాజాగా మరోసారి ఈసినిమా ఇండియాలో సందడి చేయనుంది. నవంబర్ 2న దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని యాష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ సోషల్ మీడియాలో తెలిపింది.
బాలీవుడ్ బాద్ షా షారుఖాన్, కాజోల్ కాంబినేషనలో ఆదిత్య చోప్రా దిల్ వాలే దుల్హానియా లే జాయేంగ్ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాను యశ్ చోప్రా నిర్మించారు. 1995 అక్టోబర్ 20న విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హీట్ అయ్యింది. ఈ సినిమా జతిన్-లలిత్ అందించిన సంగీతం ఇప్పటికి ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ చిత్రంలో లండన్ లో నివసిస్తున్న భారతీయ కుటుంబానికి చెందిన రాజ్ గా షారుఖ్ నటిస్తే, పెద్ద కుటుంబం నుండి అణకువగా పెరిగి తల్లిదండ్రుల మాటను జవదాటని అమ్మాయి సిమ్రన్ గా కాజోల్ నటించింది. అప్పటివరకు యాంగ్రీ యంగ్ మాన్ అమితాబ్ బచ్చన్ యాక్షన్ సినిమాలతో నిండిన బాక్సాఫీస్ ముఖచిత్రం, ఈ ప్రేమ కథ చిత్రంతో మారిపోయింది.
Palat… as DDLJ is coming back to the big screen ❤️ Experience the legendary journey of Raj and Simran on 2nd November, 2022 in theatres across India! @_PVRCinemas | @INOXMovies | @IndiaCinepolis pic.twitter.com/2ChHLqC8M7
— Yash Raj Films (@yrf) November 1, 2022
అప్పటి నుండి వేరైటీ ఎన్నారై కథలకు ఈ సినిమా ఊపిరి పోసింది. ప్రపంచవ్యాప్తంగా హిందీ పరిశ్రమ పేరు మారు మ్రోగేలా చేసిన ఆల్ టైమ్ క్లాసిక్ సినిమా ఇది. బాంబేలోని ఓ థియేటర్లో ఏకంగా 1200 ల వారాలకు పైగా ప్రదర్శించి రికార్డు సృష్టించింది. ఇండియన్ సినీ ఇండస్ట్రీ హిస్టరీలో వచ్చిన ప్రేమకథా చిత్రాల్లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా ఈ మూవీ నిలిచింది. తెలుగులో విడుదల చేస్తే..కూడా హిస్టరీ క్రియేట్ చేసింది. కథ, పాటలు, నటీనటులు, క్యారెక్టర్లు.. ఇలా ఈ చిత్రంలోని ప్రతి ఒక్కటి ప్రేక్షకుల మనసుల్లో చెరుగని ముద్ర వేసింది. ఇప్పటికి ఆ సినిమాపై ఫ్యాన్స్ లో మంచి క్రేజ్ ఉంది.
అందుకే ఫ్యాన్స్, ఆడియన్స్‌కి సర్‌ప్రైజ్ ఇవ్వాలని ‘దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే’ మూవీని హెచ్‌డి క్వాలిటీతో రీ రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేశారు. ఈ నవంబర్ 2న దేశ వ్యాప్తంగా పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలిస్ వంటి మల్టీప్లెక్సుల్లో రీ రిలీజ్ అవుతోంది. ఈ విషయాన్ని యాశ్ రాజ్ ఫిల్మ్ స్ ట్విట్టర్ లో వెల్లడించింది. దీంతో ఈ సినిమా ఫ్యాన్స్ తెగ సంబరబడిపోతున్నారు. డీడీఎల్ జీ ని థియేటర్లో చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Our favourite love story is coming back to the silver screen ❤️ Watch Dilwale Dulhania Le Jayenge on 2nd November, 2022 only in theatres @_PVRCinemas | @INOXMovies | @IndiaCinepolis pic.twitter.com/1FFJm4lhwl
— Yash Raj Films (@yrf) October 31, 2022