సమంత 'శాకుంతలం' ప్రీమియర్ షో సోమవారం రాత్రి ప్రదర్శించారు. దీంతో సినిమా టాక్ ఏంటనేది బయటకొచ్చేసింది. అదే టైంలో మూవీలో ప్లస్సులు, మైనస్ లు గురించి మాట్లాడేసుకుంటున్నారు. ఇంతకీ ఏంటి సంగతి?
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘శాకుంతలం’. మహాభారతంలోని ఓ అందమైన ప్రేమకథ ఆధారంగా ఈ మూవీ తీసినట్లు దర్శకుడు గుణశేఖర్ ఎప్పుడో చెప్పారు. ఏప్రిల్ 14న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ట్రైలర్.. క్యూరియాసిటీని పెంచుతున్నాయి. అదే టైంలో సినిమాలో సమ్ థింగ్ ఉండబోతుందనే అంచనాల్ని క్రియేట్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ లో ప్రీమియర్ షోలు వేశారు. దీంతో సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూ వచ్చేసింది. మరి సినిమా టాక్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం?
అసలు విషయానికొస్తే.. సమంత ఈ మధ్య కాలంలో అన్ని హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ ఆకట్టుకుంటోంది. గతేడాది నవంబరులో ‘యశోద’గా వచ్చింది. ఇప్పుడు ‘శాకుంతలం’గా మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయిపోయింది. రీసెంట్ టైంలో ప్రీమియర్ ట్రెండ్ అనేది టాలీవుడ్ లో మళ్లీ పెరిగిపోయింది. ‘రంగమార్తాండ’, ‘బలగం’ చిత్రాలకు అలానే పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. ఇప్పుడు అదే రూట్ లో సమంత ‘శాకుంతలం’ని కూడా ప్రదర్శించారు. దీంతో ఫస్ట్ రివ్యూ బయటకొచ్చేసింది. సినిమా చూసిన వాళ్లు సమంత, దేవ్ మోహన్ యాక్టింగ్ ని తెగ మెచ్చుకుంటున్నారు.
పీరియాడికల్ స్టోరీతో తీసిన ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం బాగుందని.. ప్రీమియర్ చూసినవాళ్లు మెచ్చుకుంటున్నారు. కొందరు ‘శాకుంతలం’ బాగుందని అంటుంటే.. మరికొందరు మాత్రం బాగోలేదని చెబుతున్నారు. ప్రస్తుతానికైతే మిక్స్ డ్ టాక్ బయటకొచ్చింది. సినిమాలో లెక్కలేనన్ని పాత్రలు ఉన్నాసరే ఎవరికీ సరైన ప్రాధాన్యం దక్కలేదనే కూడా అంటున్నారు. కాస్ట్యూమ్స్ బాగా సెట్ అయ్యాయని, మిగతా పీరియాడిక్ సినిమాలతో పోలిస్తే.. ‘శాకుంతలం’కు రన్ టైమ్ తక్కువ కావడం ప్లస్ పాయింట్ అని మాట్లాడుకుంటున్నారు. అయితే ప్రీమియర్స్ తో అసలు టాక్ ఏంటనేది అంచనా వేయలేం. కాబట్టి రెగ్యులర్ రిలీజ్ వరకు ఎదురుచూడాల్సిందే. మరి ‘శాకుంతలం’ ఎలా ఉండబోతుందని మీరనుకుంటున్నారు. దిగువన కామెంట్ చేయండి.