తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకులు, నిర్మాత గుణ శేఖర్ ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించారు. భారీ సెట్టింగ్స్ తో అద్భుతాన్ని క్రియేట్ చేసే సత్తా ఉన్న దర్శకుడిగా గుణ శేఖర్ ప్రత్యేక మార్క్ చాటుకున్నారు. అనుష్క నటించిన రుద్రమదేవి చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న గుణశేఖర్ మరో అద్భుతమైన ప్రేమ కథా చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
సమంత ముఖ్యపాత్రలో పాన్ ఇండియా మూవీగా ‘శాకుంతలం’ మూవీని తెరకెక్కిస్తున్నారు. శకుంతల, దుశ్యంతుడి అపురూపమైన ప్రణయగాథ గ్రాఫిక్స్ మాయాజాలంతో అద్భుతంగా చూపించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. ఈ మూవీలో హీరోగా మాలీవుడ్ యంగ్ హీరో దేవ్ మోహన్ నటిస్తున్నాడు. ఈ మూవీతో ఐకాన్ హీరో అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.
సమంత, దేవ్ మోహన్ జంటగా నటిస్తున్న ‘శాకుంతలం’ మూవీ ఈ ఏడాది నవంబర్ 4 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ అధికారింగా మోషన్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ మోషన్ పోస్టర్ తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీ హృదయాలకు హత్తుకునేలా ఉండబోతుందని.. ఇందులో భారీ తారగణం నటిస్తున్నారని దర్శకులు గుణశేఖర్ అన్నారు. ఈ మూవీకి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు. ఈ మూవీలో గుణ శేఖర్ మార్క్ కనిపించబోతుందని.. బ్యాగ్ గ్రౌండ్ భారీ సెట్టింగ్స్ ప్రధాన ఆకర్షణగా కనిపిస్తాయి.
గుణశేఖర్ దర్శకత్వంలో అందాల నటి సమంత నటిస్తున్న ‘శాకుంతలం’ రిలీజ్ డేట్ కోసం ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేశారు. ఈ మూవీ దిల్ రాజు సమర్పణలో గుణశేఖర్ వర్క్స్ పతాకంపై గుణ నీలిమ నిర్మీస్తున్నారు. వాస్తవానికి ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ గత ఏడాది వస్తుందని భావించారు.. షూటింగ్ పూర్తయినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల బిజీలో ఉండటం వల్ల అది కుదరలేదు. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Witness the #EpicLoveStory #Shaakuntalam in Theatres from Nov 4th 2022 Worldwide!#ShaakuntalamOnNov4https://t.co/hU4xSobAH3 @Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan #ManiSharma @neelima_guna @GunaaTeamworks @SVC_official @neeta_lulla @tipsofficial #MythologyforMilennials pic.twitter.com/zimNwKcEii
— Sri Venkateswara Creations (@SVC_official) September 23, 2022