సమంత 'శాకుంతలం' థియేటర్లలోకి వచ్చేసింది. మూవీ చూసినవాళ్లలో చాలామంది మిక్స్ డ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఈ క్రమంలో తొలిరోజు కలెక్షన్స్ కాస్త షాకింగ్ గా అనిపించాయి!
సమంత లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన మూవీ ‘శాకుంతలం‘. మహాభారతంలోని ‘అభిజ్ఞాన శాకుంతలం’ అనే దృశ్యకావ్యం ఆధారంగా ఈ సినిమా తీశారు. రకరకాల కారణాల వల్ల చాన్నాళ్ల నుంచి వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ చిత్రం.. ఎట్టకేలకు అంటే ఏప్రిల్ 14న థియేటర్లలోకి వచ్చేసింది. కానీ టాక్ అయితే ఘోరంగా వచ్చింది. కొందరు మినహా మూవీ చూసిన చాలామంది తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో ఎక్స్ ప్రెస్ చేస్తున్నారు. దీంతో తొలిరోజు కలెక్షన్స్ రిజల్ట్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగులో ఓ సినిమాపై బజ్ రావాలంటే ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర నుంచి ట్రైలర్ వరకు ప్రతిదీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. కేవలం హీరోహీరోయిన్లని చూసి జనాలు థియేటర్లకి వచ్చేస్తారనుకోవడం అత్యాశే అవుతుంది. ‘శాకుంతలం’ విషయంలో సరిగ్గా అదే జరిగింది. స్టోరీ పరంగా ఉన్నది ఉన్నట్లు సినిమాగా తీశారు. గ్రాఫిక్స్, 3D వర్క్ అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. దీంతో సినిమా చూసిన చాలామంది ప్రేక్షకులు.. డైరెక్ట్ గానే బాగోలేదని చెబుతున్నారు. ఇప్పుడు ఇదికాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సమంత ‘శాకుంతలం’ కోసం నిర్మాతలు.. రూ.60 కోట్లకు పైనే ఖర్చు పెట్టారని తెలుస్తోంది. కానీ తొలిరోజు వసూళ్లకు మాత్రం దీనితో ఏ మాత్రం పొంతన లేదని అంటున్నారు. ఎందుకంటే వరల్డ్ వైడ్ గా కేవలం రూ.5 కోట్లు కలెక్షన్స్ మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో దాదాపు రూ.1.25 కోట్ల వరకు ఓవర్సీస్ లో వసూలైనట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. మరి ఈ వీకెండ్ వరకు ‘శాకుంతలం’ టికెట్స్ తెగొచ్చేమో గానీ లాంగ్ రన్ లో ఈ మూవీ పెట్టుబడిని వసూలు చేయడం కాస్త కష్టంగానే కనిపిస్తుంది. అయితే ఫస్ట్ డే కలెక్షన్స్ పై అధికారికంగా లెక్కలొస్తే గానీ అసలు విషయం ఏంటనేది తెలియదు. మీలో ఎవరైనా ‘శాకుంతలం’ చూస్తే.. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.