సమంత 'శాకుంతలం'కి భారీ నష్టాలు తప్పవనిపిస్తోంది. కలెక్షన్స్ అయితే అస్సలు లేవు. వీకెండ్ ఏదో గడిచిపోయింది కానీ ఇప్పుడు టికెట్క్ తెగడం కూడా కష్టమే అనిపిస్తోంది.
సమంత ‘శాకుంతలం’ ప్రస్తావన వస్తే చాలు ప్రేక్షకులు భయపడిపోతున్నారు! సినిమా చాలా ఘోరంగా ఉందని చూసినవాళ్లు మాట్లాడుకుంటున్నారు. తొలిరోజే ఇలాంటి టాక్ రావడంతో.. ఒక్కరూ కూడా థియేటర్లలోకి వెళ్లాలనే ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో కలెక్షన్స్ చాలా అంటే చాలా తక్కువగా వస్తున్నాయి. చెప్పాలంటే ఓ మిడ్ రేంజ్ సినిమా వసూళ్లని కూడా దాటలేకపోతున్నాయనే చెప్పాలి. కలెక్షన్స్ నంబర్స్ చూసి నెటిజన్స్ దగ్గర నుంచి ట్రేడ్ పండితుల వరకు ప్రతి ఒక్కరూ షాకవుతున్నారు. చెప్పాలంటే అవాక్కయిపోతున్నారు. మరీ ఇంత దారుణంగా వస్తాయని అనుకొని ఉండరు బహుశా!
అసలు విషయానికొస్తే.. ‘బాహుబలి’ లాంటి గ్రాఫిక్ వండర్ తో తెలుగు సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో చాలామంది దర్శకులు ఆ తరహా మూవీస్ తీసేందుకు ప్లాన్ చేసుకున్నారు. కానీ చెప్పుకోదగ్గ రీతిలో ఒక్కరూ కూడా సక్సెస్ కాలేకపోయారనే చెప్పాలి. ఇప్పుడు ఆ లిస్టులోకి గుణశేఖర్ కూడా చేరిపోయారు. మహాభారతంలోని ఓ ప్రేమకథ ఆధారంగా ‘శాకుంతలం’ తీశారు. రకరకాల కారణాల వల్ల రిలీజ్ ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. ట్రైలర్ విడుదల టైంలో సినిమాపై కాస్త డౌట్ పడ్డారు. ఇప్పుడు అదే జరిగింది.
ప్రీ రిలీజ్ బిజినెస్ తోపాటు, టికెట్స్ బుకింగ్స్ లో జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో తొలిరోజు రూ.3.5 కోట్లు మాత్రమే వచ్చాయి. కనీసం వీకెండ్ లో అయినా పెరుగుతుందేమో అనుకున్నారు. కానీ అది జరగలేదు. ప్రస్తుతం అయితే మూడురోజులకు కలిపి సుమారు రూ.7 కోట్ల వరకే వసూలు చేసినట్లు తెలుస్తోంది. సినిమా బడ్జెట్ ఏమో రూ.60 కోట్లు వరకు పెట్టారు. కలెక్షన్స్ ఏమో మరీ ఘోరంగా వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే బ్రేక్ ఈవెన్ కాదు కదా గట్టెక్కినా సరే చాలని నిర్మాతలు అనుకుంటున్నారు. మరి పూర్తి మొత్తంలో 10 శాతం రావడం ఏంటా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీ వల్ల సమంత ఇమేజ్ కూడా భారీగానే డ్యామేజ్ అయినట్లు కనిపిస్తుంది. సరే ఇదంతా పక్కనబెట్టేయండి.. ‘శాకుంతలం’ కలెక్షన్స్ పై మీ అభిప్రాయమేంటి? కింద కామెంట్ చేయండి.