‘7ఆర్ట్స్ సరయు’ బోల్డ్ కంటెంట్‌తోనే మెసేజ్ ఇస్తూ బాగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. తాజాగా బిగ్‌బాస్ హౌస్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో అంచనాలతో హౌస్‌లోకి ఎంటర్ అయిన సరయు.. మొదటివారంలోనే ఎలిమినేట్ అవ్వడం పెద్ద చర్చకే దారి తీసింది. అలా వచ్చేస్తుందని అభిమానులే కాదు.. ఆమె కూడా నమ్మలేకపోయిన విషయం. బిగ్‌బాస్ తర్వాత సరయు మళ్లీ బుల్లితెర మీద తళుక్కుమంటోంది. కామెడీ స్టార్స్ కార్యక్రమంలో ఎక్స్‌ప్రెస్ హరి స్కిట్టులో మెరిసింది. మెరవడమే కాదు హరిని చితక్కొట్టింది కూడా.
ఇదీ చదవండి: ఉప్పెన-2 గురించి హింట్ ఇచ్చిన బుచ్చిబాబు.. పెద్ద స్కెచ్చే ఇది..
సరయు ఎంట్రీ ఇవ్వగానే శేఖర్ మాస్టర్ ఒక్కడే కాదు.. సెట్‌లోని అంతా గోలగోల చేశారు. రాగానే మంచి డైలాగ్ చెప్పి అందరినీ ఆకట్టుకుంది. సరయు దగ్గర పాలేరుగా ఎక్స్‌ప్రెస్ హరి నటిస్తాడు. డైలాగ్ చెప్పడంతోనే హరి చెంప పగలగొట్టింది సరయు. మధ్యలో గేదెలకు గడ్డి వేయండంటూ వెనక్కి తిరగ్గానే లాగి తన్నింది కూడా. కోపంతో హరి వెళ్లి సరయు కాళ్లు పట్టుకుంటాడు. మధ్యలో ‘నువ్వు మామూలుగా మాట్లాడితేనే మేము బీప్ వేసుకోవాలి.. అదే బీపీతో మాట్లాడావంటే మా పరిస్థితి ఏంటి?’ అని హరి సెటైర్ వేస్తాడు. మొత్తం మీద ఎక్స్‌ప్రెస్ హరికి ఒక రేంజ్‌లో చుక్కలు చూపించింది సరయు.